టాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాట మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో అజిత్ కుమార్.  మొదట అజిత్ టాలీవుడ్ లో ప్రేమ పుస్తకం  సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.  అజిత్ నటించే ప్రతి సినిమా తెలుగు లో రిలీజ్ అవుతుంది.  ప్రస్తుతం అజిత్ నటించిన ‘విశ్వాసం’సినిమా మార్చి 1 న తెలుగు లో రిలీజ్ కాబోతుంది.  అజిత్ తన సహనటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.   
Image result for ajith wife shalini phone
షాలిని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో బాలనటిగా పరిచయం అయ్యింది..ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.  స్టార్ హీరో హోదా ఉన్నప్పటికీ అజిత్ చాలా సింపుల్ గా ఉంటారు. సినిమాల్లో కూడా చాలా నేచురల్ గా తెల్లజుత్తుతోనే కనిపిస్తాడు.  స్వతహాగా రైడర్ అయిన అజిత్ ఎక్కువ శాతం బైక్ రైడ్ ఇష్టపడుతుంటారు.  ఆ మద్య ఓటింగ్ వేయడానికి జనాల మద్య క్యూలైన్ లో నిలబడిన ఫోటో తెగ వైరల్ అయ్యింది.  తాజాగా అజిత్ సతీమణి షాలినితో ఓ అభిమాని సెల్పీ తీసుకున్నాడు. 
Image result for ajith wife shalini phone
ఆ ఫొటోలో షాలిని చేతిలో నోకియా 3310 మోడల్‌ ఫోన్ పట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.  తమిళ సూపర్‌స్టార్‌ భార్య అయివుండి షాలిని ఇప్పటికీ ఈ ఫోనే వాడుతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  అజిత్‌తో వివాహమయ్యాక షాలిని సినిమాలకు దూరమయ్యారు. తన కుటుంబం కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు.  ఫోన్‌ సింపుల్‌, జీవితం సింపుల్‌’ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. ‘ఇప్పటికీ అదే ఫోనే వాడుతున్నారా షాలిని మేడమ్‌..’ అంటూ మరికొందరు నెటిజన్లు ఆమె సింప్లిసిటీని అభినందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: