టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ లో ఒకరు  శేఖర్ మాస్టర్.  ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీలో ‘అమ్మడు లేట్స్ డూ కుమ్ముడు’పాటకు కొరియోగ్రాఫర్ చేసిన శేఖర్ మాస్టర్ ఆ పాట సూపర్ హిట్ తో ఎంతో పాపులర్ అయ్యారు.  ఆ తర్వాత రాంచరణ్ కి సైతం కొరియోగ్రఫర్ గా పనిచేశారు.  ప్రస్తుతం కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సుఖాల గురించి మాట్లాడారు.  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవమానాలు .. కష్టాలు ఎదురుకావడం, మనసుకి బాధ కలిగించే సంఘటనలు సహజంగానే జరుగుతుంటాయి. అలాంటి బాధ మీకు ఎప్పుడైనా కలిగిందా? అనే ప్రశ్న  శేఖర్ మాస్టర్ కి ఎదురైంది. 
Image result for shakar master
ఇండస్ట్రీకి నేను డాన్సర్ ను అవుదామనే వచ్చాను. డాన్సర్ గా నేను కుదురుకోకముందు చాలా కష్టాలు పడ్డాను.  నాకు డ్యాన్సర్ గా రెండు మూడు నెలలకు ఒక్కసారి ఛాన్స్ వచ్చేది..వేరే ఏ పనైనా చేసుకుందామంటే ఛాన్స్ లు పోతాయని భయం. పోనీ ఇంటి వద్ద నుంచి డబ్బు అడగాలంటే అన్నీ మానేసి ఇంటికి రమ్మంటారు..సీరియల్స్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్లడం మొదలుపెట్టాను. జూనియర్ ఆర్టిస్ట్ గా నేను అందుకున్న ఫస్టు పేమెంట్ 75 రూపాయలు.  నా మొదటి సంపాదన చూసి చాలా ఆనందం వేసింది..అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎలాగైనా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోవాలన్న కోరిక బలంగా నాటుకు పోయిందని అన్నారు.
Image result for shekar master ammadu lets do kummudu
చిరంజీవి గారి 'ఖైదీ' సినిమాలో ఆయన డాన్స్ చూసిన దగ్గర నుంచి డాన్స్ అంటే మరింత ఇష్టం పెరిగింది. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే డాన్స్ లో మెలకువలు తెలుసుకుని హైదరాబాద్ వచ్చేశాను. నా చిన్నపుడు  మెగాస్టార్  'ఖైదీ' సినిమాలో ఆయన డాన్స్ చూసిన తర్వాత తనకూ డ్యాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగిందని..ఇంటర్మీడియెట్ పూర్తికాగానే డాన్స్ లో మెలకువలు తెలుసుకుని హైదరాబాద్ వచ్చేశాను. అలాంటిది ఆయన 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి రెండు పాటలకి నృత్య దర్శకత్వం వహించడంతో నా జన్మ ధన్యం అయ్యింది.  వినాయక్ , చరణ్  కలిసి ఈ ఛాన్స్ నాకు ఇచ్చారు. అందుకు నేను జీవితాంతం వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: