విజయ్ దేవరకొండ మ్యానియా కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు కూడ పూర్తిగా పాకడంతో విజయ్ క్రేజ్ ను తమ వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకోవాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ తన అభిమానులను ‘రౌడీస్’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. 
కోర్టులో పిటిషన్
ఆ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఒక గార్మెంట్ కంపెనీ తయారు చేసిన టి. షర్ట్స్ లుంగీలను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాపారంలో విజయ్ కు కూడ భాగస్వామ్యం ఉంది. అయితే చాల తెలివిగా బెంగుళూరుకు చెందిన ఒక వ్యాపార వేత్త ‘రౌడీ వేర్’ ప్రవేట్ లిమిటెడ్ అన్న పేరుతో ఒక గార్మెంట్ సంస్థను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా టి. షర్ట్స్ రకరకాల మోడల్స్ లో తయారు చేస్తున్నాడు. 
డియర్ కామ్రేడ్
ఈ టి. షర్ట్స్ మోడల్స్ ను అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో పెట్టడంతో ఈ టి. షర్ట్స్ కూడ విజయ్ దేవరకొండ ప్రమోట్ చేస్తున్నవే అనుకుంటున్నారు. ఈ టి. షర్ట్స్ కు విపరీతమైన స్పందన రావడంతో ఆ కంపెనీ ప్రారంభించిన కొద్ది రోజులలోనే భారీ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల నుండి కూడ ఆర్డర్స్ వస్తున్నట్లు సమాచారం. 
 రౌడీ వేర్ ప్రయివేట్ లిమిటెడ్
అయితే తెలివిగా చేసిన ఈ మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన విజయ్ దేవరకొండ తన ‘రౌడీ’ బ్రాండ్ మరొక చేతిలోకి వెళ్ళిపోయిన విషయాన్ని గుర్తించి ఆ సంస్థ పేరును రద్దు చేయవలసిందిగా విజయ్ బెంగుళూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనితో స్పందించిన కోర్ట్ ఈ విషయంలో ఆ రెడీమేడ్ గార్మెంట్స్ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈవిషయంలో అమెజాన్ సంస్థకు కూడ నోటీసులు కోర్ట్ ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో విజయ్ మ్యానియాను తెలివిగా వాడుకోవడానికి వ్యాపార సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మరొకసారి వెలుగులోకి వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: