తెలుగు ఇండస్ట్రీలో నట వారసుల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అప్పటి వరకు స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన పెద్ద కుమారుడు డి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఆయన తనయుడు రానా ‘లీడర్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన రానా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తున్నాడు.  Image result for rana ntr biopic 

హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేస్తున్న రానా, రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి, బాహుబలి 2’చిత్రాల్లో విలన్ గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా మ‌హానాయ‌కుడు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో చంద్ర‌బాబు పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశాడు. తాజాగా రానా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Image result for rana bahubali
కాగా ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు రానా.  నా ఆరోగ్యం గురించి కొన్నాళ్ళుగా ర‌కర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.  కేవ‌లం బ్ల‌డ్ ప్రెష‌ర్ (బీపీ)కి సంబంధించిన స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నాను. కొద్ది రోజుల‌లో అంతా సెట్ అవుతుంది. సిగ‌రెట్ బాగా తాగ‌డం వ‌ల‌న రానా కిడ్నీలు చెడిపోయాయ‌ని, వెంట‌నే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల‌ని వైద్య‌లు అన్న‌ట్టు ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త‌ను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాన‌ని చెప్పిన‌ప్ప‌టికి ఈ రూమ‌ర్ల‌కి మాత్రం బ్రేక్ ప‌డ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: