‘ఆఫీసర్’ ఘోర పరాజయం తరువాత రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలకు విడుదల చేయడానికి కనీసం ధియేటర్స్ అయినా దొరుకుతాయా అన్న సందేహాలు చాలామంది వ్యక్త పరిచారు. అయితే ఎవరి ఊహలకు అందకుండా గోడకు కొట్టిన బంతిలా వర్మ తిరిగి బౌన్స్ బ్యాక్ కావడమే కాకుండా తాను దర్శకత్వం వహిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు క్రేజ్ క్రియేట్ చేయడమే కాకుండా ఆమూవీకి ప్రస్తుతం జరుగుతున్న బిజినెస్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నట్లు తెలుస్తోంది. 
లక్ష్మీస్ ఎన్టీఆర్
తెలుస్తున్న సమాచారం మేరకు వర్మ ఈసినిమా విషయంలో పారితోషికం తీసుకోకుండా ఈమూవీకి జరిగే బిజినెస్ లో షేర్ అడిగినట్లు సమాచారం. ఈమూవీలో అంతా కొత్త నటీనటులే నటించిన నేపధ్యంలో పారితోషికాల నుండి మేకింగ్ వరకు అన్ని విషయాలలోనూ ఖర్చు చాల తక్కువ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 9 కోట్లు
ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీని వర్మ నాలుగు కోట్ల బడ్జెట్ తో పూర్తిచేసినట్లు టాక్. అయితే ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈమూవీ రైట్స్ ను మన ఇరు రాష్ట్రాలకు సంబంధించి 9 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ ఛానల్ ఈమూవీ శాటిలైట్ రైట్స్ ను మూడు కోట్లకు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 9 కోట్లు
దీనితో విడుదల కాకుండానే ఈమూవీకి జరిగిన 12 కోట్ల బిజినెస్ తో వర్మకు సుమారు 5 కోట్ల వరకు పారితోషికంగా ముట్టింది అని అంటున్నారు. దీనితో మరింత జోష్ లోకి వెళ్ళిపోయిన వర్మ ఈమూవీ ప్రమోషన్ ను చాల భారీ స్థాయిలో చేసి భారీ ఓపెనింగ్స్ రప్పించే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈసినిమాకు ఎంత వరకు ఎన్నికల కమీషన్ నుండి అనుమతులు వస్తాయి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: