కింగ్ నాగార్జున క్రేజ్ ను వాడుకోవాలని చూస్తున్నాడు జబర్దస్త్ కమెడియన్ మహేష్. ఈమధ్య మనవాడు సినిమాల్లో బాగా కనిపిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం సినిమాలో రాం చరణ్ పక్కన మంచి రోల్ చేసిన మహేష్ ఆ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. చిన్నా చితకా వేశాలేస్తూ వస్తున్న మహేష్ ఇప్పుడు ఏకంగా హీరోగా మారినట్టు తెలుస్తుంది.


మహేష్ ఆంచట హీరోగా వస్తున్న సినిమా నేను నా నాగార్జున. గోపాల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. గుండపు నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ నాగార్జున ఇమేజ్ వాడేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టైటిల్ మాత్రమే కాదు టైటిల్ పక్కన సైకిల్ చైను కూడా పెట్టారు.


సో నాగార్జున శివ సినిమా రిఫరెన్స్ తో ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. జబర్దస్త్ ఫ్లాట్ ఫాం మీద కామెడీ కితకితలు పెట్టి సినిమాల్లో హీరో, హీరోయిన్స్ పక్కన చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తున్న మహేష్ ఫైనల్ గా హీరోగా కూడా అదృష్టం పరిక్షించుకుంటున్నాడు. అయితే సినిమాలో ఏదో ఒకటి రెండు నిమిషాలు కనిపించే పాత్రతో అలరించిన మహేష్ ఫుల్ లెంగ్త్ రోల్ ఎలా చేస్తాడో చూడాలి. 


మహేష్ లోని సీరియస్ ఇంటెన్స్ కనిపెట్టే దర్శకుడు ఇతనితో ఓ లవ్ స్టోరీ తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీరి ప్రేమను నాగార్జున ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ. ఏది ఏమైనా హీరోగా మహేష్ మొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. అయితే హీరో అయ్యాం కదా అని కమెడియన్ గా ఛాన్సులు కాదనకుండా వీటిని చేస్తే బెటర్.   



మరింత సమాచారం తెలుసుకోండి: