కన్నడ పరిశ్రమ నుండి వచ్చి సంచలనాలు సృష్టించిన కె.జి.ఎఫ్ పై స్పెషల్ అప్డేట్ వచ్చింది. సినిమా వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా కె.జి.ఎఫ్ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. కన్నడ పరిశ్రమలో ఇప్పటివరకు ఏ సినిమా చేయని 250 కోట్ల వసూళ్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది.


సినిమా ఆశించిన స్థాయిలో ఉండటంతో కన్నడలో భారీ హిట్ సాధించగా.. తెలుగు, తమిళ, హింది భాషల్లో అంచనాలు లేకుండానే వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టింది. బాహుబలి ఫార్ములా ఫాలో అవుతున్న కె.జి.ఎఫ్ మేకర్స్ చాప్టర్ 1 కు వచ్చిన క్రేజ్ తో సెకండ్ పార్ట్ ను మరింత భారీగా తెరకెక్కించాలని చూస్తున్నారు.


అందుకే కె.జి.ఎఫ్-2లో బాలీవుడ్ క్రేజీ స్టార్స్ ను భాగం చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం కె.జి.ఎఫ్ చాప్టర్-2లో సంజయ్ దత్ నటిస్తాడని తెలుస్తుంది. ఇలాంటి యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో సంజయ్ దత్ నటిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక రవీనా టాండన్ కూడా కె.జి.ఎఫ్ 2 లో భాగమవుతున్నారట.


ఆల్రెడీ కన్నడలో ఉపేంద్రతో సినిమా చేసిన రవీనా టాండర్ మరోసారి యశ్ సినిమాతో అక్కడ ప్రేక్షకులను పలుకరించనుంది. బాహుబలి తర్వాత సూపర్ హిట్ సినిమా సీక్వల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పై ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: