సెలెబ్రెటీలు సినిమాలలో కంటే ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్న నేపధ్యంలో ఈవిషయంలో వారి ఉత్సాహం వారికి అనుకోని సమస్యలు తెచ్చిపెడుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన క్యూనెట్ మల్టీ లెవెల్ కంపెనీ మోసాలతో చాలామంది భారీ మొత్తాలలో నష్టపోయారు. 
File:Allu-sirish-much-thrilled-malayalam-debut-1971-beyond-borders.jpg
ఈ నష్టం కొన్ని వందల కొట్లలో ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన అవకతవకల చీటింగ్ కేసులో బాలీవుడ్ కు చెందిన టాప్ హీరో షారూఖ్ ఖాన్ పేరుతో పాటు బొమన్ ఇరానీ పూజా హెగ్డేల పేర్లతో పాటు టాలీవుడ్ అల్లు కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ పేరు కూడ ప్రముఖంగా బయటకు రావడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.
 Allu Sirish
వీరంతా ఈ కంపెనీ ప్రచారం కోసం నిర్మించిన ప్రచార చిత్రాలలో నటించారు. దీనితో క్యూనెట్ సంస్థను నమ్మి తాము పెట్టుబడులు పెట్టామని అదేవిధంగా తమ ఆలోచనలను ప్రభావితం చేయడంలో సెలెబ్రెటీలు ఇచ్చిన ప్రకటనలు కూడ తమను ప్రభావితం చేశాయని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. 
Allu Sirish to star in Telugu remake of Dulquer Salmaan’s  hit film ABCD
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కంపెనీ పై కేసులు వేయడమే కాకుండా ఈ సంస్థల కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న సెలెబ్రెటీల తీరు పై లోతైన విచారణ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈవిశాయానికి సంబంధించి తమ వద్దకు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావలసిందిగా నోటీసులు అందుకున్న సెలెబ్రెటీల లిస్టులో శిరీష్ కూడ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు వారం రోజులు లోగా శిరీష్ ఈ విచారణకు హాజరు కావలసి ఉంటుంది. ఇప్పటికే సినిమాలు
లేక ఇబ్బంది పడుతున్న ఈ యంగ్ హీరోకి ఈ అనుకోని సమస్యలు తలనొప్పిగా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: