టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాణించాలనే కోరికతో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ప్రయత్నిస్తుంటారు.  అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధిస్తుంటారు.  ఎంతో మంది స్టూడియోల చుట్టూ ప్రతక్షణలు చేస్తూనే ఉంటారు.  అయితే అమ్మాయిల విషయంలో కొంత మంది మాత్రం వెండి తెరపై రాణించాలని వచ్చినా..కొన్ని సార్లు బుల్లితెరపై ఛాన్సులు దక్కించుకొని సెటిలై పోతుంటారు.  అలాంటి వారిలో యూట్యూబ్‌లో శృంగార తారగా పేరు తెచ్చుకుంది స్వాతి నాయుడు. 


తెలుగు లో స్వాతినాయుడుడిని మరో సన్నీలియోన్ అని అంటారు.  గతంలో పోర్న్ మూవీస్‌లో నటించడానికి సిద్ధమంటూ ప్రకటించిన స్వాతి యూట్యూబ్ వీక్షకులకు ఈమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పలు షార్ట్స్ ఫిలిమ్స్ లో హాట్ హాట్ గా నటించి  కుర్రకారుకు హీటెక్కించింది.  అయితే రీల్ లైఫ్ లో వివాహాలు చేసుకున్న వారు ఈ మద్య చాలా మంది నటులు రియల్ లైఫ్ లో చేసుకొని సెటిల్ అవుతున్నారు.  ఈ నేపథ్యంలో స్వాతి నాయుడు కూడా వివాహం చేసుకుంది. 


తన భర్త పేరు అవినాష్ అని, తామిద్దరికీ ఫిబ్రవరి 23వ తేదీ అర్థరాత్రి 12.19 గంటలకు పెద్ద సమక్షంలో వివాహం జరిగినట్లు వెల్లడించింది. వివాహం అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. తాను కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నానని..తనను ఆశీర్వదించాల్సిందిగా స్వాతి నాయుడు కోరింది.


గతంలో బ్లూఫిల్మ్స్ చేయాలని ఉన్నా, ఇండియాలో పుట్టడం వలన సాధ్యం కావడం లేదని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. యూట్యూబ్‌ను ఎంచుకుని అందులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్వాతి పెళ్లయ్యాక వినోదానికి దూరంగా ఉంటుందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: