ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు ఎంత గుట్టు చప్పుడు కాకుండా ముగించాలన్నా..ఏదో ఒక లీకేజ్ జరగడం..ఫోటోలు, వీడియోలు లీక్ కావడంతో సినిమాలపై అంచనాలు పెంచుకుంటున్నారు ఆడియన్.  ఆ మద్య మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘సైరా’లొకేషన్ ఫోటోలు లీక్ కావడంతో చిత్ర యూనిట్ తలలు పట్టుకుంది.  స్టార్ హీరోలకు సంబంధించిన లుక్ ఎలా ఉంటుందో లీక్ కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  తాజాగా మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలతో మంచి హిట్స్ కొడుతున్న విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే మ‌ల్టీ స్టార‌ర్  చేస్తున్నాడు.

ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  గోదావరి నది తీరాన వెంకీ , చైతూ లపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించగా, ఓ వ్య‌క్తి ఆ స‌న్నివేశాన్ని సెల్ ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. 26 సెక‌న్లు గ‌ల ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

ఈ సినిమాలో  మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.  ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు.  థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: