అల్లు అర్జున్ కు పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు ఉన్నా అతడిని ప్రేమించడమే కాదు అవకాసం ఉంటే పెళ్ళి చేసుకుంటాను అంటూ మళయాళ బ్యూటీ నూరీన్ షరీఫ్ బన్నీని ఆశ్చర్యపరుస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈనెల వాలెంటైన్స్ డే నాడు విడుదలైన ‘లవర్స్ డే’ మూవీ ఫెయిల్ అయినా ఆమూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నూరీన్ షరీఫ్ కు మంచిపేరు వచ్చింది. 
అల్లు అర్జున్ కలుసుకోవడం గురించి
లవ్ రొమాన్స్ ఫ్రెండ్ షిప్ అంశాలతో అల్లబడ్డ ఈమూవీ కథ యూత్ అంచనాలను అందుకోలేక పోవడంతో ఈమూవీ ఫ్లాప్ అయింది. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా ఈమూవీ సక్సస్ అయింది అంటూ హైదరాబాద్ లో నిర్వహించిన ఈమూవీ సక్సస్ మీడియా మీట్ లో ఈమూవీలో నటించిన నటీనటులు పాల్గొన్న సందర్భంలో నూరీన్ షరీఫ్ ఈకామెంట్స్ చేసింది.
ప్రశంసలు కురిపిస్తూ సందేశాలు
అల్లు అర్జున్ కు మళయాళ ఇండస్ట్రీలో కూడ ఉన్న క్రేజ్ రీత్యా తాను బన్నీ వీరాభిమానిని అని చెపుతూ లవర్స్ డే ఈవెంట్ లో బన్నీ తన చేతిలో చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడినప్పుడు ఆ ఆప్యాయత శాస్వితంగా ఉండిపోవాలి అంటే తాను బన్నీని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.  ఇదేసందర్భంలో ఆమె మరొక ట్విస్ట్ ఇస్తూ అల్లుఅర్జున్ మూవీలో తనకు ఒక చిన్నపాత్ర ఇచ్చినా చాలని అలా నటించినందుకు తనకు ఒక్కరూపాయి కూడ పారితోషికం వద్దు అంటూ బన్నీ నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తోంది నూరీన్.

ఇక ఆసమావేశానికి వచ్చిన మీడియా వర్గాలు అడిగిన మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ వాస్తవానికి మొదట్లో తనను ఈమూవీ కోసం ఎంపిక చేసినప్పుడు తాను మెయిన్ హీరోయిన్ అని చెప్పారనీ అయితే ఆతరువాత ప్రియ వారియర్ కు పెరిగిన క్రేజ్ రీత్యా ఆమె పాత్రను పెంచి తన పాత్రను తగ్గించిన విషయాన్ని తెలియచేసింది. అంతేకాదు ఇలా జరిగినందుకు తనకు ప్రియా వారియర్ పై చాలకోపం వచ్చినా ఇది అంతా ఇండస్ట్రీలో సర్వసాధారణం అని తెలుసుకుని తాను సద్దుకు పోతున్నాను అంటోంది. మరి నూరీన్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ బన్నీ ఒప్పుకునే స్థితిలో లేకపోయినా కనీసం ఆమె కోరినట్లుగా తన సినిమాలో ఆమెకు ఒక చిన్న పాత్ర అయినా ఇస్తాడేమో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: