కళ్యాణ్ రామ్ సినిమాటోగ్రాఫర్ గుహాన్ డైరక్షన్లో నటించిన ‘118’ మూవీ రేపు విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ  ఈ నందమూరి హీరో చాల బిజీగా ఉన్నాడు. ఈమధ్య కాలంలో విడుదలయిన ఇతడి సినిమాలు అన్నీ వరస పరాజయాలు పొందినా ఈమూవీకి ఈ 14 కోట్ల బిజినెస్ జరగడంతో ఈమూవీ విడుదలకు ముందే లాభాల బాట పట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. 
Kalyan Ram in 118
ఫిబ్రవరిలో విడుదలైన అన్ని సినిమాలు ఫెయిల్ అయిన పరిస్థుతులలో ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న సగటు ప్రేక్షకుడి అంచనాలు అందుకునేలా ఈమూవీ ఉంది అనీ ఫిలిం ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీనికితోడు ఈసినిమాను ఇప్పటికే చూసి ఒక్క కట్ కూడ లేకుండా విడుదల చేయమని జూనియర్ కళ్యాణ్ రామ్ కు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. 
Nandamuri Kalyan Ram 118 teaser - Sakshi
అంతేకాదు ఈమూవీలో నటించిన నివేధా థామస్ పాత్ర ఈమూవీకి హైలెట్ అవుతుంది అంటున్నారు. క్రైం థ్రిల్లర్ మూవీలకు ఈమధ్య కాలంలో ఆదరణ బాగా లభిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై కళ్యాణ్ రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ రామ్ తన రాజకీయ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

తనకు రాజకీయాల పై ఎటువంటి ఆసక్తి లేదనీ అదీకాకుండా రెండు పడవల సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు రాజకీయాలలో పాల్గొనే అభిప్రాయం లేదనీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తాను రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయననీ సంకేతాలు ఇస్తున్నాడు. దీనితో రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి జూనియర్ కూడ దూరంగా ఉంటాడు అన్న సంకేతాలు కళ్యాణ్ రామ్ మాటలలో వినిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: