ఈసంవత్సరం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కేవలం రెండు సినిమాల పై చేస్తున్న 400 కోట్ల ప్రయోగం ఇండస్ట్రీ హీట్ టాపిక్ గా మారింది. ‘సాహో’ ‘సైరా’ సినిమాల పై ఖర్చుపెడుతున్న బడ్జెట్ 400 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దీనితో ఈరెండు సినిమాల విడుదల మధ్య గ్యాప్ కనీసం రెండునెలలు ఉండాలనీ ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొంటున్న బయ్యర్లు భావిస్తున్నారు. 
 సాహోతో పోటీ
ఇలాంటి పరిస్థుతులలో ‘సైరా’ మూవీ కూడ ఆగష్టు నెలను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది అని నిన్న లీకులు రావడంతో ‘సాహో’ నిర్మాతలు మెగా కాంపౌండ్ తో చర్చల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఇప్పటికే ‘సాహో’ తన రిలీజ్ డేట్ ను ఆగష్టు 15న ఖరార్ చేస్తూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో మెగా కాంపౌండ్ ‘సైరా’ కు సంబంధించి ఇలాంటి లీకులు ఎందుకు ఇస్తోందో ప్రభాస్ కు కూడ అర్ధం కావడం లేదు అని టాక్. 
Saaho
ఈరెండు సినిమాలకు బాలీవుడ్ మార్కెట్ కూడ చాల కీలకం అయిన నేపధ్యంలో ఇప్పటికే బాలీవుడ్ లో కూడ ప్రభాస్ ‘సాహో’ రిలీజ్ డేట్ కు ఒక క్లారిటీ వచ్చిన నేపధ్యంలో ఇలాంటి గందరగోళం ‘సైరా’ రిలీజ్ కు సంబంధించి ఎందుకు మెగా కాంపౌండ్ క్రియేట్ చేస్తోంది అన్న విషయమై ప్రభాస్ క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సాహో’ నిర్మాతలు ప్రభాస్ సూచన మేరకు అతి త్వరలో చరణ్ ను కలిసి ఈఅనవసరపు పోటీకి చెక్ పెట్టాలని ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేసారు అని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. 
 గుర్తింపు లభించలేదు
అయితే ఇండస్ట్రీ విశ్లేషకులు మాత్రం నిన్న వచ్చిన ‘సైరా’ రిలీజ్ లీకులకు సంబంధించి వేరే విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సైరా’ ఈ సంవత్సరం విడుదల కాదు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ రైట్స్ గురించి బయ్యర్లు ఇప్పటి వరకు ప్రయత్నాలు ప్రారంభించని నేపధ్యంలో ‘సైరా’ బయ్యర్లలో మ్యాడ్ క్రేజ్ ను క్రియేట్ చేసి ఈమూవీకి అత్యంత భారీ బిజినెస్ తెచ్చుకోవడానికి ఇలాంటి లీకులు ఇస్తున్నారని నిజంగానే ‘సాహో’ ‘సైరా’ ల మధ్య ఒకేసారి రిలీజ్ పోటీ ఏర్పడితే ఆ డేంజర్ గేమ్ ఇద్దరికీ నష్టం అన్న విషయం మెగా కాంపౌండ్ కు ప్రభాస్ కంటే బాగా తెలుసు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: