ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’ వరస ఘోర పరాజయాలు చెందడం బాలకృష్ణతో పాటు అతడి అభిమానులకు అదేవిధంగా అతడి సన్నిహితులకు ఊహకందని షాక్ గా మారింది. ఒక హీరో కెరియర్ కు సంబంధించి జయాపజయాలు సర్వసాధారణమే అయినా బాలయ్య కెరియర్ కు ప్రశ్నగా మారిన ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం ఒక సరికొత్త ఆలోచనలకు కొదరిలో తెర తీస్తోంది.
Poster of NTR Mahanayakudu
తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణను కనీసం ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండి వచ్చే సంవత్సరం నుండి మళ్ళీ సినిమాలలో నటించమని అతడి సన్నిహితులలో కొందరు బాలయ్యకు సూచిస్తున్నట్లు టాక్. దీనికి వారు ఒక ఉదాహరణ కూడ చూపెడుతున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి వరస ఫ్లాప్ లతో సతమతమౌతున్నప్పుడు సుమారు సంవత్సరం పైగా గ్యాప్ తీసుకుని ‘హిట్లర్’ మూవీతో తిరిగి తన హిట్స్ కెరియర్ ను కొనసాగించినట్లుగా అదే వ్యూహాలను బాలయ్య కూడ అనుసరిస్తే బాగుంటుంది అని బాలయ్య సన్నిహితుల సూచన అని అంటున్నారు.
NTR: Mahanayakudu leaked on tamilrockers
అదీ కాకుండా రాబోతున్నది ఎన్నికల కాలం కాబట్టి ఆ వంక కూడా కలిసి వచ్చి నెమ్మదిగా గ్యాప్ తీసుకునే విధంగా పరిస్థుతులు అనుకూలంగా ఉన్నాయి. అన్న విషయం కూడ కొందరు బాలయ్య దృష్టికి తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఈ గ్యాప్ లో మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి ఆలోచనలు చేయడమే కాకుండా అతడికి పనికి వచ్చే మంచి కథను వెతికే పని కూడ చేసుకోవచ్చు అనీ బాలయ్య సన్నిహితులలో ఒక వర్గం అభిప్రాయం అని టాక్. 
NTR biopic cast
అయితే ఈ సూచనలు బాలకృష్ణకు రుచించడం లేదనీ తాను ఎట్టి పరిస్తుతులలోను తన సినిమా కెరియర్ కు బ్రేక్ ఇవ్వననీ ఎన్నికల తరువాత బోయపాటి సినిమాను మొదలుపెట్టి తీరుతాను అనీ చెపుతున్నట్లు సమాచారం. అంతేకాదు గతంలో తనకు 8 సినిమాల వరస పరాజయం తరువాత బోయపాటితో తాను చేసిన ‘సింహా’ కు విజయం వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు పరాజయాలు కొత్తవి కాదు అని బాలయ్య అభిప్రాయ పడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: