తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ మొదటి సారిగా నెగిటీవ్ షేడ్స్ లో కనిపించాడు.  ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో రిమెక్ అవుతున్న నేపథ్యంలో హిందీలో రణ్ వీర్ సింగ్ నటించిన ‘సింబ’మంచి హిట్ టాక్ వచ్చింది. ఇక తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.
Image result for vishal ayogya movie
'అయోగ్య' టైటిల్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, విశాల్ సరసన నాయికగా రాశి ఖన్నా నటిస్తోంది.  అయితే ఈ చిత్రంలో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ పెడితే బాగుంటుందని దర్శకుడు వెంకట్ మోహన్ భావించాడట. వెంటనే ఈ విషయం విశాల్ కి చెప్పడంతో మనోడు కూడా ఓకే అన్నాడట. 
Image result for vishal ayogya movie
అయితే బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే అనే సాంగ్ ఈ చిత్రంలో పెట్టాలని ఆలోచనలో ఉన్నారట.  ఈ సాంగ్ విశాల్ కి కూడా చాలా ఇష్టమట. అందువలన ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో, రీమిక్స్ చేయడానికి సన్నాహాలు మొదలెట్టినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: