ఎన్నికల ముందు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీడీపీ  తలనొప్పి గా మారనున్నది. అయితే ఎలాగూ  అధికారం లో టీడీపీ ఉంది కాబట్టి ఈ సినిమా ఎలాగైనా ఆపించాలని టీడీపీ భావిస్తుందని చెప్పొచ్చు. సెన్సార్ ఇబ్బందులు సృష్టించి సినిమా విడుదల వాయిదాపడేలా చూడటం లేదా, అభ్యంతరకర దృశ్యాలు తొలగించే పథకంలో భాగంగా సినిమాను అస్తవ్యస్తం చేయడం. ఇదీ కుదరకపోతే విడుదలరోజు థియేటర్ల ముందు నిరసనలు చేయడం.. క్లుప్తంగా టీడీపీ కుటిల పన్నాగాలివి.

Image result for lakshmis ntr

ఇలా ఏ దశలోనైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఒకరకంగా మహానాయకుడిపై కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే తెలుగుదేశం పార్టీ ఫోకస్ ఎక్కువ పెట్టింది. మరోవైపు జనాల్లో మాత్రం ఆ సినిమా ఎలా ఉందో చూడాలనే కుతూహలం రోజురోజుకీ పెరిగిపోతోంది. విడుదలైన ట్రైలర్లు, పాటలు, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బాలయ్య సినిమాలు రెండూ దారుణంగా ఉండటం, వర్మ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్, ఈ రెండు సినిమాల్ని చూసిన వాళ్లు కచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా చూస్తారు.

Image result for lakshmis ntr

పార్టీల పరంగా చూసినా కూడా టీడీపీ వ్యతిరేకులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుపై ఎలాంటి సెటైర్లు పడ్డాయోనని ఆసక్తిగా చూస్తుంటారు. వారందరికీ ఈ సినిమా విందు భోజనంలా ఉండబోతోంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఎన్నిరోజులు ఆడినా, ఎంతమంది థియేటర్లకు వెళ్లినా చంద్రబాబు పరువుపోవడం మాత్రం ఖాయం. బామ్మర్దులతో కలిసి మామని బాబు ఎలా వెన్నుపోటు పొడిచిందీ, తేనెపూసిన కత్తిలాగా మామ చుట్టూ తిరుగుతూనే ఆయన సామ్రాజ్యాన్ని ఎలా హస్తగతం చేసుకుందీ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపంచబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: