చంద్రబాబుని ఓ డేట్ ఇపుడు బాగా కలవరపెడుతోంది. ఆ డేట్ అంటేనే ఎక్కడలేని గుండె దడ పట్టుకుంటోంది. కానీ ఆ డేట్ రాక మానదు. క్యాలండర్లో రోజుకొక డేట్ మారిపోతుంటే, ఆ డేట్ తొందరగా అలా ముందుకు వచ్చేస్తుంది. మరి ఆ డేట్ విషయంలో బాబు గారికి ఎందుకంత కంగారు. ఏమా కధా కమామీషూ..


అదే మరి మార్చి 22న లక్షీస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతోంది. రామ్ గోపాల వర్మ ఆ డేట్ ని ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. ఆనాడు సినిమా హాళ్ళలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సందడి చేస్తుంది. అంతే కాదు. చంద్రబాబు కూడా ఆ మూవీ ద్వారా తెర ముందుకు వచ్చేస్తారు. మరి ఆ మూవీలో అచ్చమైన కధ అంతా చెప్పేందుకు వర్మ రెడీ అయిపోయారు. అప్పట్లో అన్న గారి ముఖ్యమంత్రి పదవిని కుటుంబ సభ్యులు ఎలా లాక్కున్నారు. బావమరుదులతో కలసి అల్లుడు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారన్నది ఈ మూవీలో పూర్తిగా చూపిస్తున్నాడు వర్మ. 


సరిగ్గా ఎన్నికల టైం. అందునా నాటి వెన్నుపోటు ఇపుడిలా జనం ముందుకు రావడం, ఇవన్నీ టీడీపీకి, చంద్రబాబుకు బేజారెత్తించేవే. అయితే ఈ మూవీని విడుదల కాకుండా ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదంటున్నారు. వర్మ నాలుగాకులు ఎక్కువ చదివిన మేధావి దర్శకుడు. ఆయనకు ఇలాంటి కుట్రలు, కుత్రంత్రాలు తెరమీదకు ఎక్కించడంలో నైపుణ్యం ఉంది. అటువంటి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని బాగా దట్టించి మరీ వదిలేస్తున్నాడు. ఇదే ఇపుడు టీడీపీ టీం ని కలవరపెడుతోంది


 ఓ వైపు బాలయ్య తీసిన మహా నాయకుడు మూవీకి జనాల నుంచి స్పందన లేదు, మరో వైపు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టేజర్లకు కోట్లలో లైక్స్ వచ్చిపడుతున్నాయి. దాంతో పాజిటివ్ బజ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మూవీ కనుక జనాల దగ్గరకు వెళ్తే ఏమైనా ఉందా. అదే ఇపుడు టీడీపీ చాణుక్యున్ని వేధిస్తున్న బిగ్ ప్రాబ్లమట..


మరింత సమాచారం తెలుసుకోండి: