సూపర్ స్టార్ మహేష్ ఓ చైన్ స్మోకర్.. రోజుకి కనీసం రెండు పెట్టల సిగరెట్ కాల్చేస్తాడట.. ఏంటి అని షాక్ అవొచ్చు.. అవును ఇది నిజమే మహేష్ బాబు చైన్ స్మోకర్. నిజంగానే అతని యంగ్ ఏజ్ లో సిగరెట్లు తెగ తాగేవాడట. అయితే ఇది ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు మహేష్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ గా మారిపోయాడు.


సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ సిగరెట్ అంటే మహా ఇష్టమట. అయితే అదో వ్యసనమని.. దాని వల్ల అనారోగ్యం కలుగుతుందని తెలిసినా సిగరెట్ తాగేవాడట. అయితే ఓ రోజు ఓ స్నేహితుడు అతనికి అలెన్ కార్ రాసిన ఈజీ వే టూ స్టాప్ స్మోకింగ్ బుక్ ఇచ్చాడట.


అది చదివిన మహేష్ అప్పటి నుండి సిగరెట్ తాగడం మానేశాడట. లారెన్ కార్ రాసిన ఆ బుక్ లో ఏముంటుంది అంటే అది స్వయంగా చదివి తెలుసుకోవాల్సిందే. సిగరెట్ తాగడం వల్ల వచ్చే మానసిక ఉల్లాసం కన్నా దాని వల్ల జరిగే అనర్ధాల గురించి డీటైల్డ్ గా అందులో ఉంటుందట. ఇక స్మోకింగ్ ను దూరం చేసే కొన్ని టిప్స్ కూడా ఉంటాయట.


మనకి చెడు చేసే ఏ వ్యసనమైనా దూరం చేయాలన్న ఆలోచన వస్తే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి. అలానే మహేష్ స్మోకింగ్ దూరం చేసుకున్నాడు. అతని స్మోకింగ్ వదిలేయడానికి మాత్రం అలెన్ కార్ బుక్ బాగా సహకరించిందట. సో మీలో ఎవరైనా చైన్ స్మోకర్స్ ఉంటే వెంటనే ఆ బుక్ తెచ్చుకుని చదివేయండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: