కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమా 118 ప్రమోషన్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. తను రాజకీయాల్లోకి వెళ్లడానికి చాలా టైమ్ ఉందంటున్నాడు. ముందుగా సినిమాల్లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని. ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రాలేదని, అలా హిట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అంటున్నాడు.

Image result for kalyan ram 118

"ముందు నన్ను హిట్ సినిమా తీయనీయండి. ఒక హిట్ ఇస్తే, వెంటనే ఫ్లాప్ ఇస్తున్నాను. ఓ రెండు హిట్లు రానీయండి, ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుకుందాం." ఇలా రాజకీయాలపై తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు కల్యాణ్ రామ్. 118 సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న కల్యాణ్ రామ్, ఆ సినిమా సక్సెస్ బట్టి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెబుతానంటున్నాడు. ప్రస్తుతానికైతే రెండు కథలు విన్నాను. వాటికి ఓకే కూడా చెప్పాను. పటాస్ టైపులో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న కథ కూడా విన్నాను.

Image result for kalyan ram 118

ప్రస్తుతానికైతే 118 కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెబుతాను. ఈ రెండింటిలో ఏది చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే చెబుతాను." తను చేసిన ప్రతి సినిమాను ఎన్టీఆర్ కు చూపిస్తానంటున్న కల్యాణ్ రామ్, నా నువ్వే సినిమాను మాత్రం తారక్ కు చూపించలేదంటున్నాడు. ఎందుకో ఆ సినిమా చూపించాలని అనిపించలేదని, కానీ 118 మాత్రం చూపించానని అన్నాడు. సినిమా చూసిన ఎన్టీఆర్, ఒక్క ఫ్రేమ్ కూడా తొలిగించకుండా సినిమా రిలీజ్ చేయాలని సూచించాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: