నేరస్థులతో సెలిబ్రిటీలు కలవకూడదు. దాని వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రౌడీల పార్టీల్లో ఎవరు చేరతారు. ఏ వన్ ముద్దాయి పార్టీల్లోకి ఎవరు వస్తారు. అన్నం తిన్న వారెవరూ వైసీపీలో చేర‌రు. ఇవన్ని బాబు గారు ఆయన పార్టీ తమ్ముళ్ళ నోటి నుంచి వచ్చిన ఆణి ముత్యాల్లాంటి మాటలే.


చిత్రమేంటంటే పని గట్టుకుని ,మరీ  టీడీపీ అధినాయకుని దగ్గర బంధువులే  వైసీపీలో చేరుతున్నారు. టీడీపీ సామాజిక వర్గం వారే ఎక్కువగా చేరుతున్నారు. ఈ రోజు ఏకంగా  జూనియర్ నందమూరి మామ, చంద్రబాబు  మేన కోడలి భర్త నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరిపోయారు. జగన్ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఇక మరో వైపు ప్రసిద్ధ సాహితీవేత్త, బాబుకు,టీడీపీకి ఒకప్పటి సన్నిహితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ జగన్ని కలసి వచ్చారు. ఇక మొన్న టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దాసరి జై రమేష్ జగన్ని కలిసారు. మరి ఇదంతా చూస్తూంటే దేనికి సంకేతం అనిపించకమానదుగా. ఒక్క నాగార్జున వెళ్తే తప్పుడు సంకేతాలు అన్నారు, మరి బాబు చుట్టాలే వెళ్తున్నారు కదా. ఇక నిన్న బాబు గారి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన కొడుకుతో కలసి మరీ వైసీపీలో చేరారు. 


జూనియర్ మాటేంటి :


ఇక ఈ పరిణామాలు చూసినపుడు జూనియర్ నందమూరి రూట్ ఏంటన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఆయన‌ మామ వైసీపీలో చేరితే జూనియర్ మీద కొంతైనా ప్రభావం పడుతుంది కదా. ఇక జూనియర్ రాజ‌కీయలు ఎంత వద్దు అనుకున్నా కొంతలో కొంత వైసీపీకి ఆ సానుభూతి రాక మానదు. జూనియర్ కి టీడీపీ ఎంత బాగా గౌరవం ఇస్తుందో అందరికీ తెలుసు. ప్రత్యేకించి అభిమానులకు ఆ సంగతి ఇంకా బాగా తెలుసు. దాంతో జూనియర్ అభిమానుల్లో కొంత చీలిక అయితే తప్పకుండా వస్తుంది. అది వైసీపీకి ప్లస్ అవడం ఖాయం. అలాగే నాగార్జున ఫ్యాన్స్ కూడా వైసీపీకి మద్దతు ఇస్తారు.  ఈ సంగతులు తెలిసే బాబు గారు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కంగారు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: