నందమూరి సింహం బాలకృష్ణ డైలాగులకు సంబంధించి అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి బాలయ్యకు ఒక ప్రత్యేకమైన ఒరవడి ఉంది. అందువల్లనే 60 సంవత్సరాలు దగ్గర పడుతున్నా బాలకృష్ణకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం జనం మధ్య తన ‘జనసేన’ కోసం తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాలయ్య పంచ్ డైలాగులను అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ ని అనుసరించడం హాట్ టాపిక్ గా మారింది.
Image may contain: 1 person, smiling, text
పవన్ తన సినిమా కెరియర్ లో ఇప్పటి వరకు చిరంజీవిని అనుసరించక పోయినా  ఇప్పుడు ఓట్ల కోసం పవన్ బాలయ్య అనుసరణ చేపట్టాడు. ‘నేను ఓట్లకోసం రాలేదు.. నేను సీఎం కావాలని అనుకుంటే.. ఏ రాజకీయ పార్టీ అయినా ఆపగలదా? తొడగొట్టి చెబుతున్నా..బాంబులు వేసినా భయపడను..’ అంటూ బాలయ్య చెప్పే ఫ్యాక్షన్ డైలాగులు పవన్ నోటి వెంట రావడం పవన్ అభిమానులకు కూడ ఆశ్చర్యం కలిగిస్తోంది. 
Image may contain: 2 people, beard and text
ఈవిధంగా పవన్ కు బాలయ్య లాగ పూనకం కడప జిల్లా పర్యటనలో జరిగింది. గతంలో ఇలాగే ఎన్నికల సమయంలో చిరంజీవి కూడ ఒకసారి ఆవేశంతో తన ఎన్నికల ప్రసంగంలో బాలయ్య లాగే తోడ కొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. అయితే ఈ విషయాలను బాలయ్య అభిమానులు మరొక విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 
Image may contain: 16 people, people sitting
మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణను అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ వరసపెట్టి కామెంట్స్ చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం బాలయ్య తీరును అనుసరించడం ఒక విధంగా తమ హీరో గొప్పతనాన్ని అనుసరించడం బాలకృష్ణకు ఒక విధంగా జనంలో ఇమేజ్ పెంచేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇండియా పాకిస్తాన్ ల మధ్య యుద్ధం రాకూడదనీ అందరు కోరుకుంటూ ఉంటే పవన్ ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తనకు ముందే తెలుసు అని అనడం చూస్తుంటే పవన్ యుద్ధం కోరుకుంటున్నాడా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏమైనా ‘మహానాయకుడు’ పరాజయం బాధలో ఉన్న బాలయ్యకు పవన్ తన ‘జనసేన’ కోసం బాలకృష్ణ డైలాగులను అనుసరించడం ఇంత బాధలోనూ జోష్ ను కలిగిస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: