‘మహర్షి’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ 10 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు చిత్రీకరించిన కొన్ని సీన్స్ విషయంలో మహేష్ కు అసంతృప్తి ఉంది అన్న వార్తలు కూడ వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘మహర్షి’ ని ఏప్రియల్ 25న విడుదల చేసి తీరాలి అని మహేష్ పట్టుదల ఒక విధంగా ‘మహర్షి’ కి సమస్యగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికి క్రారణం విపరీతమైన హడావిడితో ఎడిటింగ్ విషయంలో సరైన శ్రద్ద తీసుకోకుండా గతంలో విడుదలైన చాలామంది టాప్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో తీసినవే అయినా ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి. ఇలాంటి పరిస్థితి ‘మహర్షి’ కి రాకూడదు అనకుంటే ఈమూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ద పెట్టకుండా ఆఖరి నిముషంలో జరగబోయే హడావిడి ఈమూవీకి కీడు చేసే ఆస్కారం ఉంది అని కూడ కొందరు అంటున్నారు.
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
వాస్తవానికి ‘మహర్షి’ ని తీరికగా మే నెలలో విడుదల చేద్దామని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పినా మహేష్ అంగీకరించక పోవడానికి గల కారణం మే నెల పేరు చెపితే మహేష్ కు ఉండే ఉలిక్కిపాటు. ‘బ్రహ్మోత్సవం’ ‘నాని’ లాంటి భయకరమైన ఫ్లాప్ లు మహేష్ కు మే నెలలో రావడంతో మహేష్ సెంటిమెంట్ గా మే నెల పేరు చెపితే భయపడిపోతాడు. 

తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన ‘పోకిరి’ ‘భరత్ అనే నేను’ లాంటి సినిమాలు ఏప్రియల్ లో విడుదలైన నేపధ్యంలో మహేష్ కు ఏప్రియల్ నెల ఒక ధైర్యాన్ని ఇస్తుంది. దీనితో ‘మహర్షి’ మూవీ విషయంలో కొన్ని లోపాలు ఉన్నా ఆ లోపాలు అన్నీ కవర్ చేయగల శక్తి ఏప్రియల్ నెలకు ఉంది అని మహేష్ అభిప్రాయం. దీనితో ‘మహర్షి’ మేకింగ్ లో కొన్ని లోపాలు కనిపిస్తున్నా అవి ఏవీ పట్టించుకోకుండా మహేష్ సెంటిమెంట్ కు ఓటు వేస్తున్నా కేవలం సెంటిమెంట్ తోనే బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తాయా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: