ప్రముఖ నటి శారద కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఊర్వశి శారద ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారానికి ఎంపికయ్యారు. మరికొందరు నటీమణులతో కలిసి ఆమె ఈ పురస్కారం అందుకోనున్నారు.

Image result for actress sharada


తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘కలైమామణి’ పురస్కారాలను కొన్నిసంవత్సరాలు ప్రకటించడం లేదు. దీంతో పళనిస్వామి సర్కారు వీటిని ఇప్పుడు ఒకేసారి గంపగుత్తగా ప్రకటించేసింది. 2011 నుంచి 2018 వరకు ఎనిమిదేళ్ల అవార్డులు ఒకేసారి ఎనౌన్స్ చేయడంతో జాబితా చాలా పెద్దగా మారింది.

Related image


మొత్తం 201 మందికి సంబంధిత అవార్డులను ఇస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో శారదతో పాటు కాంచన, రాజశ్రీ, బీఆర్‌ వరలక్ష్మి, కుట్టిపద్మిని, నళిని, ప్రియమణి ఉన్నారు. కలైమామణితో పాటు మరికొన్ని పురస్కారాలకూ విజేతలను ప్రకటించారు.

Related image


నటులు కార్తీ, విజయ్‌సేతుపతి, శశికుమార్‌, ఎంఎస్‌ భాస్కర్‌, సంతానం, సూరి, ప్రభుదేవాలనూ కలైమామణి వరించింది. వీరితో పాటు సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా, విజయ్‌ ఆంటోని, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు సురేష్‌కృష్ణ, సితార్‌ విద్వాంసులు జనార్దన్‌ మిట్టల్ కూడా కలైమామణి పురస్కారాలు అందుకునేవారిలో ఉన్నారుమిగిలిన పురస్కారాల విషయానికి వస్తే.. ఎస్‌.జానకికి ‘ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జాతీయ అవార్డు వరించింది. ‘బాల సరస్వతి జాతీయ అవార్డు’ను వైజయంతి మాలాబాలీకి ప్రకటించారు


మరింత సమాచారం తెలుసుకోండి: