పుల్వామా సంఘటనకు సమాధానంగా మన ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశ శక్తి సామర్ధ్యాలను ఋజువు చేసింది. ప్రపంచం యావత్తు మనకు సంఘీభావం తెలపడంతో కరుడుకట్టిన పాకిస్తాన్ అధినాయకత్వం కూడ ఒక మెట్టు దిగి మన ఇండియన్ ఆర్మీ పైలెట్ అభినందన్ ను ఈరోజు విడుదల చేస్తున్న నేపధ్యంలో భారతదేశ ప్రజలు అందరూ మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు.
సర్జికల్ స్ట్రైక్ 2
ఇలాంటి పరిస్థుతులలో ఉద్వేగభరితమైన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని కథగా మార్చి మూవీ తీయడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభం అయిపోయాయి. ఈమధ్యనే విడుదలైన ‘యూరి’ మూవీ ఇలాంటి వార్ నేపధ్యంలోనే నిర్మింపబడటమే కాకుండా ఘన విజయం సాధించి 200 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించి ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన నేపధ్యంలో అలాంటి ప్రయోగమే మరొకసారి ఈ సర్జికల్ స్ట్రైక్స్ నేపధ్యంలో జరగబోతోంది. 
 మతిపోగొట్టేలా
తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో ఈ కథతో సినిమా తీయడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఇలాంటి ఆలోచనలు చాలామంది బాలీవుడ్ నిర్మాతలకు రావడంతో ‘పుల్వామా ది టెర్రర్ అటాక్’ ‘సర్జికల్ స్ట్రైక్ 2.0’ ‘హిందూస్థాన్ హమారా హై’ ‘ది అటాక్స్ ఆఫ్ పుల్వామా’ లాంటి అనేక పేర్లతో ఇప్పటికే టైటిల్స్ రిజిస్టర్ అయినట్లు సమాచారం.
300 మంది ఉగ్రవాదులు హతం
అదేవిధంగా ఈ అంశం పై మన తెలుగులో కూడ కొందరు నిర్మాతలు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు నిర్మాతలు అయితే ఇలాంటి సినిమాలను తీయగల సమర్ధులైన దర్శకుల అన్వేషణ చేస్తూ దీనికి సంబంధించి కథ రాయగల రచయితలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది కాబట్టి ఎవరైనా సమర్ధుడైన నిర్మాత ఒక డైరెక్టర్ తో కలిసి అభినందన్ జీవితం పై బయోపిక్ తీయగలిగితే ఆమూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: