శివ నామస్మరణం రుద్రాక్ష ధారణం విభూతి పెట్టుకోవడం ఈమూడు శివ చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈమూడింటిని జీవితాంతం కొనసాగించేవారిని తీర్ధదేహులు అని అంటారు. ప్రతినెలా అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి ఆ మాసానికి శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్ధశి ‘మహాశివరాత్రి’ అవుతుంది. భోలాశంకరుడుగా భక్తులు అడిగిందే తరువాయి కోరుకున్నవి అన్నీ ఇచ్చే శివుడుని ఏకాగ్రతతో ధ్యానం చేస్తే చాలు మన కోరికలు అన్నీ తీరుస్తాడు అంటారు. 
-maha-shivratri-
భారతదేశంలో భారతీయులు అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగలలో ‘మహాశివరాత్రి’ ఒకటి. ఉత్తరభారదేశంలోని హరిద్వార్ మరియు రిష్ కేష్ ప్రాంతాల దగ్గర నుండి కన్యాకుమారి వరకు కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా ఈ పండగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మహాశివుడు పై భక్తిని తెలియజేస్తూ ఆ భక్తిని ఆ శివుడు గుర్తించాలి అనే తలంపుతో భక్తులు ఈ పండగను జరుపుకుంటారు. జ్యోతిష్యుల ప్రకారం ఈ రోజున ఉత్తర గోళం లో ఏర్పడే స్థితి వల్ల సాధారణంగానే వ్యక్తుల యొక్క శక్తులు సైద్ధాంతికంగానే పెరుగుతాయట. ఈ విపరీతమైన శక్తిని సమతుల్యతతో ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు రాత్రి మొత్తం మేలుకుని  అంటే జాగరణ చేయవలసి ఉంటుంది. అందువల్లనే శివరాత్రి జాగారణకు అంత ప్రాముఖ్యత ఉంది. 
Maha Shivaratri 2015 | Importance Of Maha Shivaratri
ఈ రోజున శివుడు శత్రువులందరి పై విజయం సాదించాడట అందుకు ప్రతీకగా ఈ పండగ జరుపుకుంటారు. ఈ రోజున శివపార్వతులు ఇద్దరు వివాహం చేసుకున్నారట. ఇలా ఎదో ఒక కారణం చేత ప్రతి ఒక్కరు ఈ రోజుని ప్రత్యేకంగా భావిస్తారు. ఈ మహాశివరాత్రి రోజున మహాశివుడు ఎంతో ప్రాముఖ్యత గాంచిన తాండవ నాట్యాన్నినర్తించాడని అంటారు. మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన లోపల ఉన్న శాంతిని ప్రశాంతతను వెతుక్కోవడం. ఎప్పుడైతే ఉన్న అశాంతి అంతా పూర్తిగా నాశనం అవుతుందో ఆ తర్వాతనే సృష్టి మళ్ళీ కొత్తగా ఉద్భవించడం జరుగుతుంది.
Maha Shivrati, Lord Shiva, Shivratri SMS, Maha Shivratri celebration, Happy Maha Shivaratri 2017, Shivratri Messages, Shivratri posts on Facebook, Shivratri Wishes
శివరాత్రి పండుగ పర్వదినాన చాలామంది అతి ముఖ్యంగా పాటించే ఒక ఆచార సంప్రదాయ వ్యవహారం ఉపవాసంతో ఉండటం. భక్తులు ఉదయం నుండి ఆ రోజు ఏమితినరు మరియు రాత్రంతా మేల్కొని ఉండి ఆ మహాశివునికి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ రోజున శివుడిని "ఓం నమః శివాయ" అని శివుడిని స్థుతిస్తూ భక్తిపారవశ్యంతో భక్తులు ఈ మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ మంత్రాన్ని మాత్రం అందరూ ఖచ్చితంగా జపిస్తారు. విశ్వం అంతా శివ చైతన్యంతో ఉంటుందనీ భక్తుల భావన. ప్రతి మనిషిలో మాత్రమే కాకుండా ప్రతి మనిషి కదలికలోను కనపడే ఆ మహాశివుడుని గుర్తించగలిగితే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా శివ సాక్షాత్కారం లభిస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: