పుల్వామా ఘటనలో మన భారతీయుడు నలభై మంది అమరులయ్యారు.  ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత ప్రాంతంలో సర్జికల్ స్టైక్ 2 నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.  దాంతో పాక్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భారత్ పై వైమానిక దాడులు నిర్వహించింది..కానీ భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పి కొట్టింది.  ఈ క్రమంలో పాక్ సైనికులకు మన భారత పైలట్ అభినందన్ పట్టుబడ్డాడు.  ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. మొన్న పాక్ ఓ విడియోను పోస్ట్ చేసింది.  అయితే తమ సైనికుడిని అప్పగించాలని భారత్..పాక్ ని కోరింది.

Image result for abhinandan release

అంతే కాదు పాక్ పై యావత్ ప్రపంచ దేశాలు కన్నెర్రజేశాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం నేరమని..సర్జికల్ దాడి విషయంలో భారత్ ని సమర్థించాయి.  దాంతో బిక్కచచ్చిన పాక్  భారత పైలట్ అభినందన్ అప్పగించేందుకు అంగీకరించాయి..ఈ మేరకు పార్లమెంట్ లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు.  నేడు  భారత పైలట్ అభినందన్ భారత్ కి తిరిగి వస్తున్నాడు. తాజాగా ఈ విషయంపై  పాకిస్థాన్ నటుడు, నిర్మాత జమాల్ షా మాట్లాడుతూ.. అభినందన్ ను విడుదల చేయాలని భారతీయులతో సహా పాకిస్థానీలందరూ కోరుకున్నారని చెప్పారు.

Image result for abhinandan release

ప్రజల సెంటిమెంట్ ను గౌరవించిన అభినందన్ ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఇమ్రాన్ తీసుకున్నారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో యుద్ధం వస్తే పాక్ ప్రజల పరిస్థితి మరింత దిగజారేదని తన అభిప్రాయం వెల్లడించారు.  పాక్ లో ఇప్పటికే 70 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని తెలిపారు. యుద్ధం వస్తే పేదరికం మరింత పెరిగేదని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: