గత కొంత కాలంగా నాగార్జున బాలకృష్ణల మధ్య ఏమాత్రం సాన్నిహిత్యం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. వీరిద్దరు ఏదైనా ఫంక్షన్స్ లో అనుకోకుండా ఎదురుపడినా పెదవుల పై నవ్వులు చిందిస్తారు తప్పించీ కనీసం పక్కపక్కన కూర్చున్న సందర్భాలు కూడ ఈమధ్య కాలంలో లేవు. ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణకు ఘోర పరాజయం తెచ్చిపెట్టిన 'మహానాయకుఁడు మూవీని నాగార్జున ఈమధ్య తన సన్నిహిత మిత్రుని ఇంటిలో చూసినట్లు సమాచారం. 
 నిరాశ చెందలేదట
వాస్తవానికి నాగార్జున సన్నిహిత మిత్రుడు బాలకృష్ణకు కూడ మిత్రుడు కావడమే కాకుండా ఆవ్యక్తి బాలయ్యతో చిన్నప్పుడు కలిసి చదువుకున్నట్లు టాక్. దీనితో ఆ ప్రముఖ వ్యక్తికి బాలయ్య పై ఉన్న ప్రత్యేక అభిమానంతో నాగార్జునను 'మహానాయకుడు' ని చూడమని చెప్పి బలవంత పెట్టడమే కాకుండా అతడి ఇంటిలోని హోమ్ థియేటర్ లో 'మహానాయకుడు' మూవీని నాగార్జునకు చూపించినట్లు టాక్. 

అయితే ఈమూవీ ప్రారంభం ముందు తాను కొంతసేపు మాత్రమే చూస్తాను అనీ నాగార్జున తన మిత్రుడుతో చెప్పి ఆతరువాత ఈమూవీ పూర్తిగా చూడటమే కాకుండా బాలయ్య ఈమూవీలో ఇంత బాగా నటిస్తే ఎందుకు ఫెయిల్ అయిందీ అంటూ నాగార్జున తన మిత్రుడి వద్ద షాక్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు 'మాహానాటి మూవీ అంత సూపర్ సక్సస్ కు ఎన్ఠీఆర్ బయోపిక్ అంత ఘోర పరాజయానికి గల కారణాలు తనకు ఇంత అనుభవం ఉన్న అర్ధం కాలేదు అని కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 
NTR: Mahanayakudu leaked on tamilrockers
అంతేకాదు అక్కినేని బయోపిక్ ఆలోచనలు తనకు లేకపోయినా సుమంత్ ఒత్తిడితో వెబ్ సిరీస్ చేయాలి అన్న ఆలోచనలు తనకు ఒకప్పుడు వచ్చాయని అయితే 'మహానాయకుడు' ఘోర పరాజయం చూసిన తరువాత తాను జీవితంలో అక్కినేని వెబ్ సిరీస్ విషయంలో కూడ ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు అన్న నిర్ణయానికి వచ్చిన అభిప్రాయాన్ని నాగ్ తన మిత్రుడుతో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఈవార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడంతో రానున్న రోజులలో మళ్ళీ బాలకృష్ణ నాగార్జునుల సాన్నిహిత్యం చూడబోతున్నామా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..     



మరింత సమాచారం తెలుసుకోండి: