పవన్ కళ్యాణ్ యధాలాపంగా అన్న కామెంట్స్ పై ఏకంగా పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చాయి అంటూ ఒక దినపత్రిక ఆసక్తికర కథనం ప్రచరించడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. భారత్‌ లో లోక్‌ సభ ఎన్నికలకు ముందు పాక్‌ తో యుద్ధం జరుగుతుందని బీజేపీకి చెందిన ఒక కీలక నేత తనకు రెండేళ్ళ కిందటే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ తన పత్రికలో  అదేవిధంగా తన వెబ్ సైట్ లో ప్రస్తావించినట్లుగా ఇందుకు సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్‌ సైట్‌లో వచ్చిన కథనాన్ని ఆ ప్రముఖ పత్రిక పేర్కొంది.
ఒక్కరోజులో అద్భుతాలు జరుగవు, నాకు చేతనైంది చేస్తాను
దీనితో ఇలాంటి పరిస్థితులు ముందుగానే పవన్ కు తెలుసా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఉత్తారాది ప్రజలకు కూడ పెద్దగా తెలియని పవన్ కామెంట్స్ ఏకంగా పాక్ మీడియాకు ఎలా తెలిసి పోయాయి అంటూ మరికొందరు తమ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 
పూర్తిగా బ్యాన్ చేస్తే కొత్త సమస్యలు
తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ చేసిన కామెంట్స్ వేరే అర్ధంలో ఉన్నాయి అని అంటున్నారు. కడప జిల్లాలో పవన్ మాట్లాడుతూ ఈ దేశానికి ఒక ముస్లిమ్ అధ్యక్షుడుగా అయ్యాడనీ అదేవిధంగా ఒక ముస్లిమ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయ్యాడనీ అదేవిధంగా బాలీవుడ్ టాప్ హీరోలుగా ముగ్గురు ముస్లిమ్ లు ఉన్నారని పవన్ కామెంట్ చేస్తూ అటువంటి పరిస్థితులు పాకిస్తాన్ లోని మైనారిటీ అయిన హిందువులకు ఉన్నాయా అంటూ ఆవేశంగా అడిగిన ప్రశ్నకు పాక్ మీడియా ఇలాంటి అర్ధాలు సృష్టించింది అంటూ పవన్ క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం.
Pawan, Darling Of Pakistan Media!
అంతేకాదు ఈ కథనం పై పవన్ స్పందిస్తూ తనకు ఒక మిత్రుడు ఈ ఇండియా పాక్ యుద్ధ వాతావరణం గురించి చెప్పాడనీ తనకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈవిషయం చెప్పలేదనీ పవన్ క్లారిఫికేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవాలు ఏమైనా ఇప్పటి వరకు పవన్ పేరు కూడ తెలియని పాక్ ప్రజలకు అనుకోకుండా పాక్ మీడియా పుణ్యమా అని పవర్ స్టార్ పేరు అక్కడ కూడ చాలామందికి తెలిసింది అనుకోవాలి..
.


మరింత సమాచారం తెలుసుకోండి: