అల్లు అర్జున్ టాప్ హీరోల రేంజ్ కి చేరుకున్నాక ఇంచుమించు ప్రతి సంవత్సరం సమ్మర్ రేస్ లో తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యూహాలు కొనసాగిస్తున్నాడు. అయితే బన్నీ సినిమా విడుదలై పది నెలలు గడిచిపోయినా అతడి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కూడ కాకపోవడంతో కనీసం ఈ సంవత్సరం బన్నీ సినిమా విడుదల ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Allu Arjun in Naa Peru Surya Naa Illu India
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫ్లాప్ తరువాత బన్నీ రకరకాల ఆలోచనలు చేసి ఎట్టకేలకు త్రివిక్రమ్ తో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి అయినప్పటికీ సినిమా మొదలు అవ్వకపోవడానికి అల్లు అర్జున్ కారణం అని అంటున్నారు.
ALLU ARJUN
తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తయారు చేసిన ఈకథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఆతరువాత స్థానంలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు టాక్. అయితే అల్లు అర్జున్ ఈసినిమాకు సంబంధించి యూత్ ఫుల్ ఎలిమెంట్స్ డోస్ పెంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కొంత వరకు తగ్గించమని త్రివిక్రమ్ కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
naa peru surya naa illu india first day box office collections
అంతేకాదు విజయ్ దేవరకొండ సినిమాలో ఉండే విధంగా యూత్ ఫుల్ సీన్స్ తో పాటు కొద్దిగా ఘాటైన రొమాంటిక్ సీన్స్ ను కూడ కలపమని త్రివిక్రమ్ కు బన్నీ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. సాధారణంగా త్రివిక్రమ్ వ్రాసే కథ ఎన్ని సార్లు మార్పులు చేర్పులు చేసినా మొదటిసారి వచ్చినట్లుగానే ఉంటుంది కానీ మార్పులు కనిపించవు అని అంటారు. దీనితో అల్లు అర్జున్ సూచనలు అమలు పరచలేక వాస్తవానికి తాను బన్నీతో సినిమాను తీస్తున్నానా లేదంటే విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నానా అర్ధంకాక త్రివిక్రమ్ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు  టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: