భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ పవు చిత్రాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకుంది.  తెలుగు,తమిళ భాషల్లో అందాల కథానాయికగా శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  కానీ అక్కడ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత కెరియర్ పై దృష్టి పెట్టని కారణంగా ఆమెకి ఈ మూడు భాషల్లోను అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
Related image
తాజాగా 'వేలూరు'లోని ఒక కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి హాసన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ సినిమా అంటే మీకు ఎక్కువ ఇష్టం? మీరు కలిసి నటించిన హీరోల్లో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం? అంటూ కళాశాల విద్యార్థులు ప్రశ్నించారు.
Image result for ajit kumar
దానికి వెంటనే మా నాన్నగారు నటించిన ‘మహానది’చిత్రం అంటే నాకు ఎంతో ఇష్టం..ఆ చిత్రంలో ఆయన ఎంతో అద్బుతంగా నటించాడని శృతి హాసన్ తెలిపింది.  ఇక నేను నటించిన హీరోల్లో అజిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం అంటూ మాట్లాడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: