నందమూరి కళ్యాణ్ కెవి గుహన్ కాంబినేషన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా 118. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా తెరకెక్కించిన విధానం బాగున్నా సినిమాకు ఆయువుపట్టైన ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గా నడిపించి వెళ్తిగా చేశాడు గుహన్. అయితే ప్రస్తుతం తెలుగులో పోటీగా ఏ సినిమా లేదు కాబట్టి ఈ సినిమాకు టాక్ పర్వాలేదు అన్నట్టు ఉంది.


అందుకే సినిమా ఓపెనింగ్ డే మరీ నిరాశపరచే వసూళ్లు కాకుండా ఆమోదయోగ్యంగానే వచ్చాయి. ఏపి, తెలంగాణా ఏరియాల్లో దిల్ రాజు ఈ సినిమాను కొన్నాడు. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన 118 ఏపి, తెలంగాణా వరకు 6 కోట్ల దాలా బిజినెస్ చేసిందట. అయితే మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో 118 సినిమా 1.40 కోట్లు వసూళు చేసింది.


కళ్యాణ్ రాం ముందునుండి ఈ సినిమాపై కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమా నిర్మించారు. నివేదా థామస్, షాలిని పాండే ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ ఏరియాల వారిగా ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 0.51 కోట్లు
సీడెడ్: 0.23 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.17 కోట్లు
కృష్ణ: 0.12 కోట్లు
గుంటూరు: 0.17 కోట్లు
ఈస్ట్ : 0.09 కోట్లు
వెస్ట్: 0.07 కోట్లు 
నెల్లూరు: 0.04 కోట్లు 
టోటల్: 1.40 కోట్లు    



మరింత సమాచారం తెలుసుకోండి: