పవన్ తన జీవితంలో ఎవరు ఉపకారం చేసినా వారి పేరు తన జీవితాంతం గుర్తుంచుకోవడమే కాకుండా అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనకు చేసిన ఉపకారం అందరికి తెలిసేలా భహిరంగంగా చెపుతూ ఉంటాడు. అందుకే పవన్ కు అభిమానుల కంటే భక్తులు ఎక్కువ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా  ఉన్న నేపధ్యంలో పవన్ తన సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం  తెలియచేసాడు. 
తొలి చిత్రం తర్వాత
ఇటీవల పవన్ కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పవన్ తన అభిమానుల వంక చూస్తూ తాను పవర్ స్టార్ అవడానికి కారణం రైల్వేకోడూరుకు చెందిన వ్యక్తే అన్న షాకింగ్ న్యూస్ చెప్పాడు.  అంతేకాదు నటుడిగా తాను తొలి రెమ్యూనరేషన్ తీసుకుంది రైల్వే కోడూరుకు చెందిన నిర్మాత నుంచే అని చెపుతూ అతడి పేరు నిర్మాత దాశరథి అన్న పేరు బయట పెట్టాడు. 
 తొలి సీటు
వాస్తవానికి తాను టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ అయినా తన తొలిసినిమా పరాజయం చెందిన తరువాత తనకు పెద్దగా అవకాశాలు రాలేదని పవన్ చెప్పాడు. అంతేకాదు ఆరోజులలో తనను నమ్మి అవకాసం ఇచ్చిన ఏకైక వ్యక్తి రైల్వే కోడూరుకు చెందిన వ్యక్తి దాశరధి మాత్రమే అంటూ ఆయన గురించి పవన్ చెపుతున్న సందర్భంలో పవన్ పక్కనే ఉన్న మరొక వ్యక్తి నిర్మాత దాశరధి ఆ సమావేశం జరుగుతున్న దగ్గర ప్రాంతంలోనే ఉన్నాడు అని చెప్పడంతో షాక్ అయిన పవన్ తన జనసైనికుల ద్వారా నిర్మాత దాశరధికి కబురు పెట్టడమే కాకుండా ఆ వ్యక్తిని వేధిక పైకి పిలిచి ఆలింగనం చేసుకుని తన కృతజ్ఞతను తెలియచేసాడు. 
సభలోనే నిర్మాత
ఇదే సందర్భంలో పవన్ ఈ సంఘటనకు మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు మొదటి పారితోషికం ఇచ్చిన రైల్వే కోడూరు ప్రాంతం నుండి తన ‘జనసేన’ అభ్యర్ధి రాబోతున్న ఎన్నికలలో విజయం సాధిస్తే అది తనకు నిజమైన గౌరవం అంటూ తన అభిమానులకు పిలుపు ఇచ్చాడు. అంతేకాదు తనను పవర్ స్టార్ అని పిలవడమే కాకుండా ఆ పిలుపుకు కారణమైన రైల్వే కోడూరు ప్రాంతం నుండి తనకు విజయం దక్కేలా కృషి చేయమని పవన్ పిలుపు ఇవ్వడంతో పవన్ వీరాభిమానులు ఉత్సాహానికి లోనయ్యారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: