టాలీవుడ్ సీనియర్ హీరో బాలక్రిష్ణ షాక్ లో ఉన్నారా. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయన డ్రీం ప్రాజెక్ట్ గా తన తండ్రి జీవిత చరిత్రను రెండు భాగాలుగా  తెరకెక్కించారు. అవి కచ్చితంగా హిట్ కొట్టి మరపురాని తీపి గురుతుగా తన సినీ కెరీర్లో నిలిచిపోతాయనుకున్నారు. కానీ జరిగింది వేరు. రెండు భాగాలుగా వచ్చిన కధానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.


దీంతో ఇపుడు బాలయ్యలో అంతర్మధనం మొదలైందంటున్నారు. ఎందుకిలా జరిగింది అన్నది అంతుపట్టడంలేదట. కనీసం తన ఫ్యాన్స్ అయినా చూసినా మూవీల‌కి ఇంత ఘోర పరాభవం రాదు కదా అని బాలయ్య అనుకుంటున్నారుట. అంటే కనీసం ఫ్యాన్స్ కూడా పట్టించుకోని మూవీలుగా మారాయని  బాలయ్య తెగ బాధ పడుతున్నారట. దీనికంతటికీ కారణం ఏమీ ఉంటుందని ఆయన తరచి చూడగా ఒక విషయం స్పష్టమైనట్లుగా చెబుతున్నారు.


బాలయ్య ఇప్పటి వరకూ వందకు పైగా సినిమాలు చేసినా ఆయన ఎక్కడా సొంతంగా నిర్మాణం చేయలేదు. నిర్మాతగా తెరపైన పేరు కూడా వేసుకోలేదు. బాలయ్య బాగా హిట్లు కొడుతున్న టైంలో ఆయన నిర్మాతగా మారుదామని ఉబలాటపడ్డారు. తన ఇద్దరు కూతుళ్ళ పేర్లను కలిపి బ్రహ్మ తేజా మూవీస్ అంటూ నిర్మాణ సంస్థను ప్రారంభించారు కూడా. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తుకున్నాక ఓ జ్యోతిష్యుని సలహా మేరకు నిర్మాణాన్ని ఆపేశారని చెబుతారు. బాలయ్యకు సీనీ నిర్మాణ రంగం అచ్చిరాదని సదరు జ్యోతీష్యుడు చెప్పాడట. దాంతో బాగా నమ్మకం ఉన్న బాలయ్య దాన్ని పక్కన పెట్టారు.


అయితే ఇన్నాళ్ళ తరువాత బాలయ్య మళ్ళీ పాత సెంటిమెంట్ ని పక్కన పెట్టి మరీ ఎన్ బీకే బ్యానర్ ని ప్రారంభించి తన తండ్రి జీవిత చరిత్రను మూవీగా తీశారు. ఇపుడు ఆ రెండూ ఘోరంగా డిజాస్టర్లు కావడంతో బాలయ్య పూర్తిగా ఆ జ్యోతిష్యుని మాటలను నమ్ముతున్నారట. ఇక భవిష్యత్తులో మళ్ళీ సినిమాలు తీయరాదని బాలయ్య నిర్ణయం కూడా తీసుకున్నారని చెబుతున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: