తెలుగుదేశంపార్టీ ఒకరకమైన విచిత్ర స్థితి మద్యలో నుండి పయనిస్తుంది. అంతేకాదు నలభై సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డెబ్బైయేళ్ళ భారత రాజకీయ కురువృద్ధుడికి ఒక్కసారిగా తాను గతంలో చేసిన "పాపాల పాపరేళ్లు" మిన్నాగుల్లా మీదకు దూకుతూ దడబుట్టిస్తున్నాయి. గతం అంతా పాపాల పెనుకూపం అధికారం చేజిక్కించుకోవటానికి, ఆత్మజులను ఆత్మజలను ఆయనకు దూరం చేసిన వికృత రాజకీయ క్రీడలో సాక్షాత్తు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన దుస్సాంప్రదాయం ఆసేతు హిమాచలం భారత దేశం అంతటికి నైచ్యం దృశ్యరూపంలో బట్టబయలు కానుంది. ఈ సినిమా రాం గోపాల్ వర్మకు కీర్తి కిరీటం పెట్టేస్తుంద నటానికి ఎలాంటి అనుమానం అక్కరలేదు. 
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
పోనీ వర్తమానమైనా కొన్ని పుణ్యకార్యాలు చేసారా అంటే తండ్రికి కొడుకు తోడై — పాపాగ్నికి, దురాశ ఆజ్యం తోడవగా,  ఇప్పుడు గత పాపాల చరిత్రతో చంద్రబాబు నిజ నగ్న స్వరూపం  బట్టబయలు చేయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తరుణం సమీపిస్తున్న కొద్దీ  తెలుగుదేశం పార్టీకి (మార్చి 22) టెన్షన్ మొదలైంది. 
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
ఇప్పటికే బామ్మర్ది బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటించిన ఎన్ టీఆర్ మహానాయకుడు తెలుగు చిత్ర సీమలోనే అత్యంత  డిజాస్టర్గా మారిన వైనం ఒక వైపు, లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వర్మ పెడుతున్న టెన్షన్ మరోవైపు చంద్రబాబు అండ్ కో ను మానసికంగా వెంటాడి వేటాడుతున్నాయి. వర్మ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీ దగ్గర పడుతుంటే పచ్చబృందం లో  దడ అలజడి కలకలం బృందగానం చేస్తున్నాయి. గుండె దడ మొదలైంది. 
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
ఆ సినిమా విడుదలని అడ్డుకోడానికి అగచాట్లు పడుతున్నారు టీడీపీ నేతలు. న్యాయస్థానం మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో, అధికారబలంతో టిడిపికి కాపలా కుక్కలా మరిన ఏపి పోలీస్ సహాయంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఏదోరకంగా ఆపాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతి బరి లో నిలిచిన ఎన్ టీఆర్ కథానాయకుడు, కోసం ఇతర సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేసిన చరిత్ర టీడీపీది. సినిమా రంగాన్ని కాలనాగు లా చుట్టేసిన టిడిపి కుల మాఫియా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల సమయంలో గొడవలు చేయాలనుకోవటం, చేయడం వారికి కొత్తేమీ కాదు. 
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
అందులోనూ సాక్షాత్తూ టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారు. అయ్యగారి ఆజ్ఞ అయిపోయింది కాబట్టి, వర్మపై విరుచుకుపడ్డానికి రెడీగా ఉంది ''పచ్చ దండు కు పచ్చ పాత్రికేయం – పచ్చ మీడియా” ఆజ్యం పోయటానికి సిద్ధంగానే ఉంది. వీటికి సంబంధించిన కార్యాచరణ కూడా రెడీ అయిందని సమాచారం.
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
సెన్సార్ ఇబ్బందులు సృష్టించి సినిమా విడుదల వాయిదాపడేలా లేదా, అభ్యంతరకర దృశ్యాలు తొలగించే పథకంలో భాగంగా సినిమాను అస్తవ్యస్తం చేయడం. ఇదీ కుదరక పోతే విడుదలరోజు థియేటర్ల ముందు నిరసనలు ధర్మ న్యాయ నిర్మాణ దీక్షలతో పాటు నాయకుని పరువు ప్రతిష్టల పోకడ నిరోధ దీక్షలు చేయడం క్లుప్తంగా టీడీపీ కుతంత్ర కుటిల పన్నాగాలివి.  ఇలా ఏదో ఒక దశలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఒకరకంగా మహానాయకుడిపై కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది.
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
మరోవైపు జనాల్లో మాత్రం ఆ సినిమా ఎలా ఉందో చూడాలనే కుతూహలం రోజు రోజుకీ పెరిగిపోతోంది. విడుదలైన ట్రైలర్లు, పాటలు, సినిమా వివరాలు, నటీనటుల ప్రకటన ప్రత్యేక టీజర్ లు, పాత్రధారుల పరిచయం, ఎంపిక లోనే విస్పోఠనం సృష్టించిన వర్మ సినిమా విడుదల పై ఆసక్తిని పెంచుతున్నాయి. బాలయ్య సినిమాలు రెండూ దారుణాతి ధారుణంగా పరాభవానికి పరాకాష్ట చవిచూడటం ఇదంతా వర్మ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. 
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
ఈ రెండు సినిమాల్ని అందులో చూపని నిజాల్ని- కొత్తగా ఆడిన అబద్ధాల్ని చూసి భరించిన వాళ్లు ఖచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా చూస్తారు. పార్టీల పరం గా చూసినా కూడా టీడీపీ వ్యతిరేకులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుపై ఎలాంటి సెటైర్లు పడ్డాయోనని ఆసక్తిగా చూస్తుంటారు. వారందరికీ ఈ సినిమా విందు భోజనం లా ఉండబోతోంది. అంతే కాడు నేటి యువతకు ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబంలోని ఈతరం వారసులకు కూడా తమ పితామహుని నిజచరిత్ర  తెలుసుకొనే అవకాశం.  
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఎన్నిరోజులు ఆడినా, ఎంతమంది థియేటర్లకు వెళ్లినా చంద్రబాబు పరువు పోవడం మాత్రం ఖాయం. బామ్మర్దులతో కలిసి మామని బాబు ఎలా వెన్నుపోటు పొడిచిందీ, “తేనెపూసిన కత్తి — గోముఖ వ్యాఘ్రం--మేకతోలు కప్పుకున్న పులి” లాంటి ఊహాజనిత విషయాలను వెండితెరపై దృశ్యంగా చూడ బోవటం ఒక చక్కని అనుభవం. మామ చుట్టూ తిరుగుతూనే ఆయన సామ్రాజ్యాన్ని ఎలా హస్తగతం చేసుకుందీ, ఇందులో కళ్లకు కట్టినట్టు చూపంచ బోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.
Related image

నాయుడులో పేరుకుపోయిన పదవీ లాలస, రాజ్యాధి కార కాంక్ష, సంపద పోగేసే వ్యాపార మిళిత రాజకీయం, కుటిలాలస, కుశ్చిత కుతంత్ర మనోభావ చిత్రీకరణ చీకటి వెలుగుల్లోనో - సప్తవర్ణ సంగమంగానో చూస్తూ రాజకీయాల్లో శకునికే పాఠాలు బోదించగల స్థాయికి ఎదిగిన నాలుగు దశాబ్ధాల రాజకీయ రాజసం అంతా అవగత మౌతుంది. 
Image result for Lakshmi's NTR Vs shivars Chandrababu & TDP
మొత్తమ్మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం సగటు ప్రేక్షకుడిలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా ఆందోళనతో కూడిన ఆశక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక్కడే “లక్ష్మీస్ ఎన్టీఆర్ సగం సక్సెస్”  సాధించింది. ఇక విజయం సంపూర్ణం కావటం ఒక ఫార్మాలిటీ మాత్రమే. 



Image result for yagna shetty and chandrababu


భవిష్యత్ రాజకీయ తారక లోకాభి రామాయణం  

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: