రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ చాలవేగంగా జరుగుతున్న పరిస్థుతులలో వీరిద్దరి వ్యక్తిత్వం పై ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్న ఆసక్తికర చర్చలు రాజమౌళి దృష్టివరకు వెళ్ళినట్లు టాక్. చరణ్ జూనియర్ లు ఈమధ్య కొన్ని విషయాల పై ఓపెన్ గా అనుసరించిన ద్వంద వైఖరితో వీరిద్దరి వ్యక్తిత్వం పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
RRR Launch Event
ఇక వివరాలలోకి వెళితే ‘వినయ విధేయ రామ’ ఘోర పరాజయం తరువాత చరణ్ తన అభిమానులకు వ్రాసిన ఓపెన్ లెటర్ లో ఆసినిమా కోసం అందరూ కష్టపడి పనిచేసారు అని చెపుతూ అందరి పేర్లు ప్రస్తావించి బోయపాటి పేరు ప్రస్తావించక పోవడంతో ఆమూవీ ఘోర పరాజయానికి బోయపాటి కారకుడు అన్న సంకేతాలు ఇచ్చాడు. అయితే ఇదే ‘వినయ విధేయ రామ’ విడుదలకు ముందు చరణ్ ఇంటర్వ్యూలు ఇస్తూ బోయపాటిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసిం చడమే కాకుండా తాను ఇప్పటి వరకు బోయపాటి దర్శకత్వంలో ఎందుకు పనిచేయలేదు అంటూ కామెంట్స్ చేసాడు.

అదేవిధంగా జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణ సమయంలో ఆసినిమా గురించి ఎవరైనా జూనియర్ ను ప్రశ్నిస్తే ఆసినిమా విషయమే తనకు తెలియదు అని అంటూ పరోక్షంగా సెటైర్లు వేసేవాడు. అలాంటి జూనియర్ ‘కథానాయకుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చి తన బాబాయ్ బాలయ్యను ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించాడు. అయితే ‘కథానాయకుడు’ విడుదల అయ్యాక జూనియర్ ఆసినిమా గురించి కనీసం తన ట్విటర్ లో కూడ కామెంట్ చేయకుండా సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘ఎఫ్ 2’ పై ప్రశంసలు కురిపించాడు. 

దీనితో జూనియర్ చరణ్ లు వారివారి విషయాలకు సంబంధించి ద్వంద ప్రమాణాలు అనుసరిస్తున్నారు అంటూ కొంతమంది జూనియర్ చరణ్ ల ద్వంద వైఖరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణంలో ఉండగానే వీరిద్దరి వ్యక్తిత్వంలోని ద్వంద ప్రమాణాల పై నెగిటివ్ కామెంట్స్ రావడం భవిష్యత్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కు సంబంధించి ముఖ్యంగా ఆమూవీ ఫలితం గురించి ఏమైనా ప్రభావం చూపెడుతుందా అన్న కోణంలో రాజమౌళి ఆలోచనలు ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: