‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీ స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ పై మరింత అంచనాలు పెరిగిపోవడంతో ఈమూవీ నిర్మాణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 300 కోట్లభారీ బడ్జెట్‌ తో తీస్తున్న   ఈమూవీ విడుదల గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తోంది. 
విజువల్ ఫీస్ట్
ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ పై మరింత అంచనాలు పెరగడానికి అదేవిధంగా ఈమూవీ బిజినెస్ కు మరింత స్పీడ్ తీసుకురావడానికి ఈరోజు ‘సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్ పుట్టినరోజు సందర్భంగా కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన    ‘షేడ్స్ ఆఫ్ సాహో - 2' ను విడుదల చేసిన కొద్ది క్షణాలలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా కొద్ది సేపటిలోనే లక్షల హిట్స్ వైపు దూసుకు వెళ్ళిపోతోంది. ఈ మేకింగ్ వీడియో  చూసిన వారికి  హాలీవుడ్ స్థాయిలో ‘సాహో' నిర్మాణం జరుపుకుంటోంది అన్న విషయం  మరోకసారి స్పష్టం అయింది.  
రూ. 300 కోట్ల బడ్జెట్, ఎవరి ఊహకు అందరి రేంజిలో
ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోవాడని ఎన్నో మేకింగ్ టెక్నిక్స్ ‘సాహో' కోసం ఉపయోగిస్తున్న విషయం ఈ  చాప్టర్ 2ను చూసిన వారికి స్పష్టంగా అర్ధం అవుతోంది. దీనితో ‘సాహో' సినిమా స్థాయి ఎలా ఉంటుందనేది ఎవరి ఊహలకు అందని విషయంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
Saaho Chapter 2: Guns, Goons, Girl... Boom!
 పైగా కేవలం యాక్షన్ సీన్లకే 100 కోట్లు ఖర్చుపెట్టిన ఈ సినిమా రేంజ్ చూస్తూ ఉంటె ఈమూవీ కలెక్షన్స్ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈరోజు  విడుదల అయిన సాహో చాప్టర్ 2తో ఈమూవీ బిజినెస్ ‘బహుబలి’ స్థాయిలో జరుగబోతోంది అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: