Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:03 am IST

Menu &Sections

Search

చంద్ర బాబు ఎత్తులు వర్మ దగ్గర సాగటం కష్టం ... ఏకంగా గుర్తునే మార్చేశాడు ..!

చంద్ర బాబు ఎత్తులు వర్మ దగ్గర సాగటం కష్టం ... ఏకంగా గుర్తునే మార్చేశాడు ..!
చంద్ర బాబు ఎత్తులు వర్మ దగ్గర సాగటం కష్టం ... ఏకంగా గుర్తునే మార్చేశాడు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రామ్ గోపాల్ వర్మ జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన డైరెక్టర్. అయితే ఎప్పుడు వివాదాలతో సావాసం చేయడం వర్మ కు బాగా అలవాటు అయ్యింది. అయితే వర్మ లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను ఈ నెల 22న విడుదల చేయడానికి వర్మ సిద్ధం అయ్యాడు. అయితే చంద్ర బాబు ఎలాగైనా సినిమా ను ఆపాలని అనుకుంటున్నారు.  సెన్సార్ దగ్గరే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్డుగోడ కట్టేయాలని చూస్తున్నారు బాబు. తెలుగుదేశం పార్టీపేరు, పార్టీ సింబల్ వాడటంపై అభ్యంతరం తెలపాలనుకుంటున్నారు. తమ పేర్లు పెట్టి, తమ పార్టీ గుర్తు చూపిస్తూ, తమను కించపరిచే సన్నివేశాలుంటే వాటిని తొలగించాలనే డిమాండ్ తో మొత్తం సినిమానే అడ్డుకోవాలనే పన్నాగం పన్నారు.

ram-gopal-varma-chandra-babu-naidu-lakshmis-ntr

అందుకే వర్మ ముందు జాగ్రత్తగా మొత్తం విషయాన్నే మార్చేసుకున్నారని సమాచారం. గతంలో రక్తచరిత్ర సమయంలో కూడా సెన్సార్ కత్తెర నుంచి తప్పించుకోడానికి ఊరి పేర్లతో సహా మొత్తం పాత్రల పేర్లనే మార్చేశారు రామ్ గోపాల్ వర్మ. అసలైన పాత్రలు గుర్తుకొచ్చేలా, కాస్త దగ్గరగా పోలిన పేర్లను పెట్టి కవర్ చేశారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ గుర్తు సైకిల్ ని రిక్షాలా మార్చి చూపిస్తున్నారు వర్మ. తెలుగుదేశం పార్టీకి కూడా కొనసాగింపుగా కొత్త పదాన్ని జతచేస్తున్నారు.

ram-gopal-varma-chandra-babu-naidu-lakshmis-ntr

తాజాగా విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో రిక్షా గుర్తు బైటపెట్టి అందర్నీ షాక్ కి గురిచేశారు వర్మ. ఎన్టీఆర్ పాత్రధారి పార్టీ పెట్టి రిక్షా గుర్తుపై పోటీచేసి ఏడాది తిరిగేలోగా అధికారంలోకి వచ్చినట్టు చూపిస్తారన్నమాట. ఇక ఎన్టీఆర్ సహా.. సినిమాలో మిగతా పాత్రల పేర్లన్నీ మారిపోతాయి. వెన్నుపోటు బాబుతో సహా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మార్చేస్తారు. లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పరు కాబట్టి అక్కడ లిబర్టీ తీసుకున్నారు. మొత్తానికి చంద్రబాబు అండ్ బ్యాచ్ ని చాలా తెలివిగా ఏమార్చి, ఉన్నది ఉన్నట్టు చూపించడానికి సర్వం సిద్ధంచేశాడు రామ్ గోపాల్ వర్మ.

ram-gopal-varma-chandra-babu-naidu-lakshmis-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite