కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఏం చేసినా అదో పెద్ద సంచలనమే.. ఈమధ్యనే అత్తారింటికి దారేది తమిళ రీమేక్ చేసిన శింబు ఆ సినిమాతో నిరాశపరచాడు. రీసెంట్ గా 90 ఎం.ఎల్ అని ఓ అడల్ట్ కంటెంట్ మూవీ రిలీజైంది. బిగ్ బాస్ తొలి సీజన్ తో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఓవియా అందులో హీరోయిన్ గా నటించింది.


ఆ సినిమాకు శింబు మ్యూజిక్ అందించడమే కాకుండా గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలా కనిపించడమే కాదు తన మార్క్ చూపించేలా ఓ లిప్ లాక్ కూడా చేశాడు. ఓవియాతో శింబు లిప్ లాక్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరితో ఒకరితో ఎఫైర్ లేనిది లైఫ్ లో అంత కి ఉండదని అనుకునే శింబు బిగ్ బాస్ భామ ఓవియాతో డేటింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.


బిగ్ బాస్ లో తన టాలెంట్ తో ఓవియా తమిళ ప్రేక్షకులను అలరించింది. అయితే అలాంటి భామ 90 ఎం.ఎల్ సినిమా చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో అడల్ట్ డోసు ఎక్కువవడమే కాదు సిగరెట్, మద్యపానం లాంటివి సేవించడం తమిళ ప్రేక్షకులకు నచ్చలేదు. అయితే యూత్ ఆడియెన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా ఎక్కేసింది.


ఆ సినిమాలో శింబు గెస్ట్ రోల్ మాత్రమే కాని తెల్లవారు ఝామున 5 గంటలకే హౌజ్ ఫుల్ అవడం విశేషం. అయితే ఓవియా మాత్రం శింబు అంటే తనకు అభిమానమని చెబుతుంది. ఈ అభిమానం ప్రేమగా మారడం ఎంతసేపు చెప్పండి. శింబు కనీసం ఓవియాతో అయినా లైఫ్ లాంగ్ రిలేషన్ కొనసాగిస్తాడా లేక మధ్యలోనే ఆపేస్తాడా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: