టాలీవుడ్ లో రాజమౌళి ‘బాహుబలి, బాహుబలి2’సినిమాల తర్వాత ఆ తరహా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఒకప్పుడు 50 కోట్ల బడ్జెట్ అంటే టాప్ నిర్మాతలు వెనుకా ముందు ఆలోచించే వారు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..మినిమం వంద కోట్లు లేనిదే టాప్ హీరోల సినిమాలు ఉండటం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లాంటి ప్రతిష్టాత్మక సినిమా రూపొందుతుంది.  ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తుంది.   
దసరాకు వస్తుందా?
రామ్ చరణ్ తన సొంత బేనర్ 'కొణిదెల ప్రొడక్షన్స్' పతాకంపై నిర్మిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఈ మూవీ కోసం ఖర్చు పెడుతున్నారు.  సినిమా షూటింగును షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విఫలం కావడంతో చిరంజీవి అసంతృప్తిలో ఉన్నారని, త్వరిత గతిన పనులు పూర్తి చేసేలా దర్శకుడికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా ఆలస్యం అవుతున్నా కొద్ది ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంటుందని..ఈ తరహాలో వచ్చిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంఘటనలు తెలిసిందే.
Image result for ram charan surendar reddy
షూటింగ్, విఎఫ్ఎక్స్, ప్రొస్ట్ ప్రొడక్షన్ ఇలా చాలా పనులు మిగిలి ఉండటం, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి పోవడమే చిరంజీవి ఆగ్రహానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. షూటింగ్ డిలే అవుతుండటంతో మూవీ అనుకున్న సమాయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా? అనే సందేహం నెలకొని ఉంది.  ఇలాంటి అనుమానాలకు చెక్ పెట్టాలంటే అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: