సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘ఎఫ్ 2’ ఘన విజయం సాధించడమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో 50 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శింపబడి మరో రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఈమూవీ అర్థ శతదినోత్సవ వేడుకను చిత్ర యూనిట్ మొన్న ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్ర రావు ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సీనియర్ దర్శకులు ఈవేడుకకు అతిథులుగా హాజరయ్యారు.
 ఆరోగ్యం కోసం
ఈ సందర్భంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించిన చిత్రం ‘ఎఫ్ 2’ అని అంటూ బయ్యర్లకు ఈస్థాయిలో లాభాలు రావడం చూసి చాలా ఏళ్ళు అవుతోందని అంటూ ఈమూవీ పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈమూవీ దర్శకుడు అనిల్ రావి పూడి గురించి మాట్లాడుతూ సాధారణంగా చాలామంది  ఆరోగ్యం కోసం జిమ్ కి వెళతారని అయితే అనిల్ రావిపూడి సినిమాలు చూస్తేచాలు  జిమ్ కు వెళ్లనవసరం లేదని నవ్వులతోనే ఆరోగ్యం పెరుగుతుందని అంటూ అనిల్ రావి పూడి పై ప్రశంసలు కురిపించాడు. 
 చిన్న సినిమా
అయితే ఇక్కడ  రాఘవేంద్రరావు మరో ట్విస్ట్ ఇస్తూ ఈమూవీలో హీరోయిన్లు తమన్నా మెహ్రీన్ లను అనిల్ రావిపూడి చాలా గ్లామరస్ గా చూపించాడు అని చెపుతూ వాళ్లిద్దరూ బికినిలో నటించడం కూడ ఈసినిమా విజయానికి ఒక కారణం అంటూ రొమాంటిక్ సెటైర్ వేసాడు. హీరోయిన్లని ఎక్కువగా కన్నీళ్లు  ఏడుపులతో చూపించకుండా గ్లామరస్ గా చూపిస్తేనే జనం బాగా వస్తారు అని మరోసారి ‘ఎఫ్ 2’  సక్సెస్స్ నిరూపించింది అంటూ రాఘవేంద్రరావు కామెంట్స్ చేసాడు. ఇదే ఫంక్షన్ కు మరో అతిథిగా వచ్చిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన సినిమా  ‘పెళ్ళాం ఊరెళితే’ చిత్రానికి ఇన్స్ పైర్ అయి ‘ఎఫ్ 2’ సినిమా చేసాను అంటూ అనిల్ రావిపూడి ఓపెన్ గా చెప్పడం అతని నిజాయితీకి ఒక నిదర్శనం అంటూ కామెంట్స్ చేసాడు. 
 తమన్నా, మెహ్రీన్ బికినిలో
లాజిక్స్ లేకుండా కేవలం కేవలం ప్రేక్షకులను నవ్వించడమే ప్రధాన ధ్యేయంగా సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రయోగాలతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి మరో జంధ్యాల దొరికాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే హాస్య సినిమాలకు చిరునామాగా కొనసాగిన జంధ్యాల తన కెరియర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు చిరంజీవి బాలకృష్ణలతో సినిమాలు చేసి ట్రాక్ తప్పాడు. ఇప్పుడు అనీల్ రావిపూడి కూడ మహేష్ లాంటి టాప్ హీరోలతో సినిమా చేస్తున్న నేపధ్యంలో జంధ్యాల సెంటిమెంట్ పునరావృతం అవుతుందో లేదో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: