తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.   కెరీర్ లో నటించిన చిత్రాలు తక్కువే అయిన దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్.  అల్లు అర్జున్ ఆఖరి చిత్రం నాపేరు సూర్య.   ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బన్ని.  ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం  ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది.  ఇదిలా ఉండగానే బన్నీ ఇంకో కొత్త సినిమాను సెట్ చేసుకున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు 3.30 గంటలకు అనౌన్స్ కూడా చేశారు. 

ఈ చిత్రం బన్నికి 20వ చిత్రం.  అయితే ఈ చిత్రానికి దర్శకులు ఎవరు, చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయాలు మాత్రం తెలియజేయలేదు.  దీనికి సంబంధించిన అషిషియల్ ప్రకటన కోసం కొంత సేపు ఆగాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: