ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు లో ఇప్పటికే మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా యాత్ర చిత్రాలు వచ్చాయి.  ఇందులో ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అంచనాలు అందుకోలేక పోయింది.  బాలీవుడ్ లో సైతం పలు బయపిక్ చిత్రాలు వస్తున్నాయి. కోలివుడ్ స్టార్ హీరో సూర్య మొదటి నుంచి ఎన్నో వైవిధ్య పాత్రలు ఎంచుకుంటూ నటిస్తున్నారు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 
Image result for surya new movie
ప్రస్తుతం సూర్య రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  సాలా ఖదుస్ - గురు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర సూర్య 38వ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపినాథ్ జీవిత ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు టాక్ వస్తోంది.
Image result for sudha kongara
విమాన పరిశ్రమలలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకోవచ్చి కనీసధరలకు టికెట్స్ రేట్స్ ను అందుబాటులోకి వచ్చేలా చేసిన గోపినాథ్ జీవితం ఎంతో స్ఫూర్తిగా  ఈ చిత్రం తెరకెక్కించబోతున్నారట. ఆయన జీవిత కథ వినగానే సూర్య చాలా ఇంప్రెస్ కావడం..వెంటనే ప్రాజెక్ట్ పై ఓకే అంటూ సంతకం కూడా చేసినట్లు సమాచారం.  ప్రస్తుతం సూర్య సెల్వా రాఘవన్ అలాగే కెవి.ఆనంద్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: