బాలీవుడ్ లో బూతు సినిమా లు వచ్చేవి . ఇప్పడూ ఆ కల్చర్ తెలుగు , తమిళం కు పాకింది.  బాలీవుడ్‌ తర్వాత అప్‌డేట్‌ అయ్యే తెలుగు, తమిళ చిత్రాలు కూడా ఇప్పుడు బూతుల్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అన్ని సినిమాల్లోను మగాళ్లతో పచ్చిగా మాట్లాడిస్తోంటే, తమిళ చిత్రం '90 ఎంఎల్‌'లో ఆడవాళ్లతో సెక్స్‌ ముచ్చట్లు మాట్లాడించారు. ఆడవాళ్లు మందు సిట్టింగ్‌ వేసి తమ సెక్స్‌ అడ్వెంచర్స్‌ గురించి చెప్పుకుంటే అనే కాన్సెప్ట్‌లోంచి పుట్టుకొచ్చిన ఈ చిత్రం తెలుగులోకి 'ఇది చాలా తక్కువ' టైటిల్‌తో అనువాదమవుతోంది.

Image result for 90 ml

 బిగ్‌బాస్‌ తమిళంతో పాపులర్‌ అయిన ఓవియా కథానాయికగా నటించింది. 'నీవి గంగా బొండాల్లా వుంటాయే...' అని స్నేహితురాలి వక్షస్థలానికి కాంప్లిమెంట్‌ ఇచ్చిన యువతి 'నావే బత్తాయిల్లా వుంటాయని' దిగాలు పడుతుంది. మరో యువతి దానికి సమాధానంగా 'నాకు దేవుడు నిమ్మకాయలే పెట్టాడే' అని వాపోతుంది.

Image result for 90 ml

ఇంత దారుణంగా ఆడవాళ్లతో బూతులు మాట్లాడించిన దర్శకుడు సెక్స్‌ టాక్‌ విషయంలోను హద్దులు దాటించాడు. మరి ఈ చిత్రం సెన్సార్‌ని దాటి ఎన్ని బూతులు వినిపించేలా బయట పడుతుందనేది తెలియదు కానీ యూట్యూబ్‌లో దీని ట్రెయిలర్‌ మాత్రం వైరల్‌ అయింది. అయితే ఇటువంటి సినిమాలు కుర్రకారు ను టార్గెట్ చేసుకొని వదలటం వల్ల మంచి పాపులారిటీ సంపాదిస్తున్నాయి. అందుకే యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ ను రాబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: