నిన్న అందరికీ షాక్ ఇస్తూ సుకుమార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ మూవీ ప్రకటన మైత్రీ మూవీస్ సంస్థ పై రావడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్ తో చేయవలసి ఉన్న మూవీ ఇంకా ప్రారంభం కాని నేపధ్యంలో సుకుమార్ అల్లు అర్జున్ ల మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న విషయం ప్రశ్నగా మారింది. 
Big Breaking: Sukumar and Allu Arjun film locked
మరి కొందరయితే సుకుమార్ మహేష్ పై వ్యూహాత్మక ఒత్తిడి చేయడానికి అదేవిధంగా తన కథను మహేష్ రిజక్ట్ చేసాడు అన్న అవమానాన్ని తప్పించుకోవడానికి బన్నీ కొత్త సినిమా  వ్యూహానికి తెర తీసాడు అంటూ ఊహాగానాలు కూడ చేసారు. అంతేకాదు ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాక కూడ సుకుమార్ ను మహేష్ నమ్మకపోవదాన్ని సుకుమార్ అవమానంగా తీసుకుని మహేష్ కు షాక్ ఇవ్వడానికి ఇలాంటి స్కెచ్ వేసాడు అన్న కామెంట్స్ కూడ వచ్చాయి. 
Sukumar To Hold Short Film Contest
ఈ విషయం పై ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ తన తెలివితేటలు ఉపయోగించి సుకుమార్ కు ఇచ్చిన రివర్స్ షాక్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ ఈవిషయమై ట్విట్ చేస్తూ ‘క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్ తో సినిమా చేయడం కుదరడం లేదు. రెస్పెక్ట్‌ ఆల్వేజ్‌ ఫర్‌ సుకుమార్ సర్ ఎ ఫిలిం మేకర్‌ ఎక్స్‌లెన్స్‌’  అంటూ ట్విట్ చేసి తాను ఏవిధంగాను సుకుమార్ ను అగౌరవ పరచలేదు అన్న విషయాన్ని పరోక్షంగా తెలియచేసాడు. 
Sukumar
దీనితో సుకుమార్ బన్నీ సహాయంతో ప్రయోగించిన అస్త్రం వికటించినట్లు అయింది. ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరు ఖాళీగా లేని నేపధ్యంలో సుకుమార్ సినిమాలో నటించే ఆసక్తి ఉన్నా ఏ హీరోకు డేట్స్ లేని పరిస్థితి. దీనితో అల్లు అర్జున్ సుకుమార్ కు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం త్రివిక్రమ్ తో సినిమాను చేస్తూ సుకుమార్ సినిమాలో కూడ నటిస్తాడా లేదంటే త్రివిక్రమ్ పూర్తి అయ్యేవరకు సుకుమార్ ను ప్రస్తుతానికి వెయిటింగ్ లో పెడతాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: