మహేష్ సుకుమార్ ల మూవీ అధికారికంగా క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు అనీల్ రావిపూడి తాను మహేష్ తో తీయబోతున్న మూవీ స్పీడ్ పెంచేలా పరిస్థుతులు ఏర్పడ్డాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఏప్రియల్ లో మొదలవుతుందని అంటున్నారు. అనీల్ రావిపూడి చాల వేగంగా సినిమాలను తీస్తాడు కాబట్టి ఈమూవీని 5నెలలలో పూర్తి చేసి ఏమాత్రం కుదిరినా ఈ ఏడాది చివరిలో ఈమూవీని విడుదల చేసేలా వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.
మహేష్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న అనిల్ రావిపూడి వ్యూహాలు !
ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. మహేష్ పక్కన హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేయాలని అనీల్ రావిపూడి ఒక ప్రాధమిక నిర్ణయం తీసుకుని ఈవిషయమై మహేష్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

అనీల్ రావిపూడి మరో కొత్త ప్రయోగానికి అడ్డుపడిన దిల్ రాజ్ !
ఈమూవీకి సంబంధించిన కథ రీత్యా హీరోయిన్ కు చాల ప్రాధాన్యత ఉండటమే కాకుండా ఈమూవీలోని హీరోయిన్ పాత్ర చాల హైపర్ గా ఉంటుందని సమాచారం. మరొక విధంగా చెప్పాలి అంటే ‘ఎఫ్ 2’ సినిమాలో హనీ బెబిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మెహెరిన్ హైపర్ యాక్టింగ్ స్థాయికి మించి మహేష్ మూవీలో హీరోయిన్ పాత్ర మేనేజరిజమ్స్ ను ప్రత్యేకంగా అనీల్ రావిపూడి డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

అనీల్ రావిపూడి మరో కొత్త ప్రయోగానికి అడ్డుపడిన దిల్ రాజ్ !
దీనితో హీరోకు నటనపరంగా ఛాలెంజ్ విసిరే హీరోయిన్ పాత్రను సాయి పల్లవి చేత నటింప చేస్తే ఆమెకు తమిళ మళయాళ మార్కెట్ లో ఉన్న క్రేజ్ రీత్యా మహేష్ మూవీకికోలీవుడ్ మాలీవుడ్ లలో కూడ మంచి మార్కెట్ తో పాటు క్రేజ్ వస్తుందని అనీల్ రావిపూడి మహేష్ కు సూచించినట్లు టాక్. సాయి పల్లవి నటన విషయంలో మహేష్ కు మరొక అభిప్రాయం లేకపోయినా తమ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ పై బాగుంటుందా అన్న విషయంలో లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందామని మహేష్ అనీల్ రావిపూడికి చెప్పినట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: