రాజకీయాలలో సినిమాలలో మిత్రులు శతృవులు శాస్వితంగా ఉండరు అన్న విషయం మరొకసారి రుజువైంది. చిరంజీవితో అంతంత మాత్రంగా ఉండే రాజశేఖర్ దంపతులు ‘మా’ అధ్యక్ష ఎన్నికలలో చిరంజీవి సపోర్ట్ కోసం ఆయన ఇంటికి వెళ్ళడం చిరంజీవి వారికి అభయం ఇవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే టాలీవుడ్ లో ఎన్నికల వాతావరణం ఊపు అందుకుంది.
మెగాస్టార్ నివాసానికి
వచ్చే ఆదివారం సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీ రాజాల మధ్య మా సంస్థ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచార పర్వానికి ఊపు అందుకుంది. ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ దంపతులు నరేశ్ ప్యానల్ లో కలిసి పోటీ చేస్తూ ఈ ఎన్నికలను చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందర్నీ కలుపుకుపోతు ఇండస్ట్రీ టాప్ సెలెబ్రెటీలను కలుస్తున్నారు. 
సంపూర్ణ మద్దత్తు
ఆ మధ్యన మా అసోసియేషన్ నిధుల విషయంలో నరేష్, శివాజీ రాజా మధ్య విభేదాలు తలెత్తిన నేపధ్యంలో ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ మీడియాకు ఎక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ ‘మా’ సంస్థ ఎన్నికల కోసం తిరిగి పోటాపోటీగా ప్రచారం చేస్తూ గత విషయాల పై ఎవరికీ అనుగుణంగా వారు తమ వ్యూహాలు కొనసాగిస్తున్నారు. 
 తెరవెనుక మాత్రమే
ఇలాంటి వివాదాలు తల ఎత్తినప్పుడు గతంలో దాసరి లాంటి ప్రముఖులు ఇండస్ట్రీ పరువు బయట పడకుండా సద్దుబాటు చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి కొనసాగుతున్న నేపధ్యంలో ఈ రెండు వర్గాలను పిలిచి సద్దుబాటు చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీలోని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. అయితే టాప్ హీరోలు అంతా ఈ వివాదంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా ఎవరికీ బలం ఉంటే వారు గెలుస్తారు అనే తటస్థ వైఖిరి తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: