నేటి సినిమాల్లో మహిళా ప్రాధాన్యత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా బడ్జెట్ ఎంతైనా.. హీరో ఎవరైనా.. కథ ఏదైనా.. అసలు సినిమాలు కావాల్సిన గ్లామర్ తెచ్చిపెట్టేది మహిళలే అదే హీరోయిన్సే. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం పాటల్లోనే వచ్చి వెళ్తుండేవారు. పాతతరం సినిమాల్లో మహిళా ప్రాధాన్యత కనబడేది. మధ్యలో కొన్నాళ్లు కేవలం హీరో సెంట్రిక్ మూవీస్ వచ్చాయి.    


ఫీమేల్ లీడ్ సినిమాలు చేయాలంటే దర్శక నిర్మాతలు వెనుకడుగు వేసేవారు. అయితే పరిస్థితి మారింది కథకు తగినట్టుగా అది ఫీమేల్ లీడ్ సినిమా అయినా ప్రయోగాలు చేస్తున్నారు ప్రస్తుత ఫిల్మ్ మేకర్స్. ఫీమేల్ లీడ్ సినిమాలకు పెద్ద బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు హీరోయిన్ క్రేజ్ దృష్ట్యా కొద్దిపాటి కథ, కథనాలు బాగుంటే సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయినట్టే. 


ఒకప్పుడు స్టార్ సినిమాల్లో హీరోయిన్స్ కు అంత ప్రాధాన్యత ఉండేది కాదు కాని ఇప్పుడు వారు కూడా కథానాయికల విషయంలో ఆలోచన మార్చుకున్నారు. కొంతమంది హీరోలైతే హీరోయిన్ పాత్రలకే మొదట ప్రిఫరెన్స్ ఇచ్చి మరి సినిమాలు చేస్తున్నారు. సౌత్ హీరోయిన్స్ లో ఫీమేల్ లీడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు అనుష్క, నయనతార.


తమిళంలో నయనతార చేస్తున్న ప్రయోగాత్మక సినిమాల గురించి తెలిసిందే. ఇక తెలుగులో అనుష్క కూడా అరుంధతి నుండి సైజ్ జీరో వరకు ఫీమేల్ లీడ్ సినిమాలు చేసింది. హీరోలకు ఏమాత్రం తగ్గని విధంగా హీరోయిన్స్ సినిమాలు ఉంటున్నాయి. ఇక సినిమాల్లో పాత్రలు కూడా మిగతా మహిళలకు స్పూర్తి నింపేలా ఉంటున్నాయి. ఇక కేవలం తెర మీదే కాదు తెర వెనుక కూడా మహిళలు ఉంటున్నారు. దర్శకులు, సహాయక దర్శకులుగా ఇప్పటికే చాలామంది మహిళలు తమ సత్తా చాటుతున్నారు. కొందరు గ్లామర్ తో మరికొందరు అభినయంతో ఇలా సినిమాకు కావాల్సిన ఎంటర్టైన్ అందిస్తూ ఆడియెన్స్ ను అలరించడంలో హీరోయిన్స్ ముందుంటున్నారు.      
 


మరింత సమాచారం తెలుసుకోండి: