Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 4:06 am IST

Menu &Sections

Search

మహేష్ ... సుకుమార్ కు షాక్ ఎందుకు ఇచ్చాడు ..!

మహేష్ ... సుకుమార్ కు షాక్ ఎందుకు ఇచ్చాడు ..!
మహేష్ ... సుకుమార్ కు షాక్ ఎందుకు ఇచ్చాడు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రంగ స్థలం వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ .. మహేష్ తో సినిమా ప్లాన్ చేశాడు. కానీ కొన్ని నెలల నుంచి ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. కానీ సుకుమార్ .. మహేష్ ను ఒప్పించలేకపోయాడు. అయితే మహేష్ రిజెక్ట్ చేయడం వెనుక ఒక సెంటిమెంట్ అడ్డొచ్చిందని సినీ సర్కిల్ లో వినిపిస్తుంది. తనకు ఫస్ట్ టైమ్ హిట్ ఇచ్చిన దర్శకులతో మాత్రమే రెండోసారి పనిచేస్తాడు ఈ హీరో. తనతో చేసిన ఫస్ట్ సినిమానే ఫ్లాప్ గా ముగిస్తే ఆ దర్శకుడి జోలికి రెండోసారి వెళ్లడు.

mahesh-babu-sukumar

ఒక్కడుతో సక్సెస్ ఇచ్చాడు కాబట్టే నమ్మి గుణశేఖర్ కి మరో రెండు అవకాశాలిచ్చాడు. పూరీ జగన్నాథ్ పోకిరి తీశాడనే హిట్ సెంటిమెంట్ తోనే బిజినెస్ మేన్ చేశాడు. అతడు మూవీ తర్వాత త్రివిక్రమ్ తో ఖలేజా, దూకుడు తర్వాత శ్రీనువైట్లతో ఆగడు చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడింది కాబట్టే శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆఫర్ ఇచ్చాడు. తాజాగా శ్రీమంతుడు, భరత్ అనే నేను.. సినిమాలు కూడా ఇదే సెంటిమెంట్ తో కొరటాల శివ దక్కించుకున్నాడు. ఇలా సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కే రెండోసారి అవకాశమివ్వడం మహేష్ బాబుకి అలవాటు, ఆనవాయితీ. ఫ్లాప్ తీస్తే మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దర్శకుడుని నమ్మడు. అతడి ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా కూడా తనతో సెట్ కాడని తీసి పక్కనపెట్టేస్తాడు.

mahesh-babu-sukumar

సరిగ్గా సుకుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. 1-నేనొక్కడినే సినిమాతో మహేష్ ని బాగా డిజప్పాయింట్ చేశాడు సుకుమార్. పైకి కల్ట్ క్లాసిక్ అని చెబుతున్నప్పటికీ, ఆ దెబ్బతో ప్రయోగాల జోలికి ఇంకోసారి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కడో ఇద్దరికీ రెండోసారి లైన్ కుదిరింది. మహేష్ కి లోపల సెంటిమెంట్ పీకుతున్నా కథ వినడానికి రెడీ అన్నాడు. రెండు మూడు సిట్టింగ్ లు అయినా, ఏదీ ఫైనల్ కాలేదు. రంగస్థలం ఫీల్ నుంచి బైటపడని సుకుమార్ అదే లైన్ చుట్టూ తిరుగుతూ మహేష్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. దీంతో మహేష్ మొహమాటం లేకుండా వద్దని చెప్పేశాడు.

mahesh-babu-sukumar
5/ 5 - (1 votes)
Add To Favourite