మహేష్ సుకుమార్ ను పక్కకు పెట్టి అనీల్ రావిపూడి వైపు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అనీల్ రావిపూడి పై నమ్మకం కంటే 50 కోట్ల భారీ పారితోషికం అన్న ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఈమూవీని నిర్మిస్తున్న అనీల్ సుంకరతో మహేష్ సొంత నిర్మాణ సంస్థ భాగస్వామ్యం వహిస్తూ ఉండటంతో మహేష్ వాటాకు ఈసినిమాకు సంబంధించి 50 కోట్ల షేర్ వస్తుంది అని అనీల్ రావిపూడి చెప్పిన లెక్కలకు మహేష్ పడిపోయినట్లు సమాచారం.
డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్ ద్వారా పెట్టుబడి రికవరీ
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించి మహేష్ ఎటువంటి పారితోషికం తీసుకోకుండా ఈమూవీకి జరిగే బిజినెస్ లో మూడవ భాగం తీసుకుంటానని చెప్పినట్లు టాక్. ఈమూవీకి మహేష్ పారితోషికం లేకపోవడంతో ఈమూవీని 50 కోట్ల బడ్జెట్ తో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాలని అనీల్ రావిపూడి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 
రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
అదేవిధంగా ఈమూవీకి సంబంధించి అనీల్ రావిపూడి తయారు చేసిన అంచనాల ప్రకారం ఈమూవీ శాటిలైట్ డిజిటల్ డబ్బింగ్ రైట్స్ ద్వారా 50 కోట్ల ఆదాయం వచ్చేలా అంచనాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఈమూవీ ఏరియా బిజినెస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ఆదాయం వచ్చి మొత్తంగా వచ్చే 150 కోట్ల ఆదాయంలో మహేష్ వాటాగా 50 కోట్లు ఇస్తామని నిర్మాత అనీల్ సుంకర అనీల్ రావిపూడిలు ఈమూవీకి సంబంధించి తయారు చేసిన బిజినెస్ ప్లాన్ కు మహేష్ వెంటనే పడిపోయినట్లు టాక్.  
సరికొత్త రికార్డ్ ఖాయమా?
దీనితో ఈ 50 కోట్ల మోజుతో మహేష్ కు సుకుమార్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ లు గుర్తుకు వచ్చి అదే వంకతో సుకునార్ మూవీ నుండి తెలివిగా జంప్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీలో హీరోయిన్ పాత్ర విషయమై సాయి పల్లవి ఎంపిక గురించి ఇచ్చిన లీకులకు మిశ్రమ స్పందన రావడంతో ఇప్పుడు అనీల్ రావిపూడి దృష్టి రష్మిక పై పడటమే కాకుండా మహేష్ రష్మికల కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్న యాంగిల్ లో తన యూనిట్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: