నందమూరి కళ్యాణ్ రామ్ కు అదృష్టం చాల తక్కువ. అతడికి నటుడుగా మంచి పేరు వచ్చినా రకరకాల కారణాలతో అతడి సినిమాలకు విజయం దూరంగా ఉంటుంది. అయితే గతవారం విడుదలైన ‘118’ కు సగటు ప్రేక్షకుడి ప్రశంసలు లభించినా అనుకున్న స్థాయిలో ఈమూవీ కలక్షన్స్ విషయంలో వెనకడుగు వేయడానికి ఈమూవీ రాంగ్ రిలీజ్ టైం అని అంటున్నారు. 
Kalyan Ram in 118
వాస్తవానికి కళ్యాణ్ రామ్ కు అంటూ ప్రత్యేకమైన అభిమానులు లేరు. దీనితో కళ్యాణ్ రామ్ సినిమాల విజయం సగటు ప్రేక్షకుడి మెప్పు పైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పరీక్షలు సీజన్ రన్ అవుతున్న నేపధ్యంలో చాలామంది యూత్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 
Kalyan Ram 118 Movie Title Logo - Sakshi
ఇలాంటి పరిస్థుతులలో విడుదలైన ‘118’ కు మంచి టాక్ రావడంతో ఈమూవీ కలక్షన్స్ బాగానే ఉన్న నేపధ్యంలో ఈమూవీ ఫైనల్ రన్ పూర్తి చేసుకునేసరికి సుమారు 10 కోట్ల కలక్షన్స్ రావచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈసినిమాను ఈ నెలలో కాకుండా జనవరి 25న రిపబ్లిక్ డే టార్గెట్ గా విడుదల చేసి ఉంటే ఈమూవీకి ఇప్పుడు వచ్చిన పాజిటివ్ టాక్ రీత్యా ఖచ్చితంగా 20 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చి ఉండేవి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

గతంలో ఇలాగే కళ్యాణ్ రామ్ మూడు సంవత్సరాల క్రితం సంక్రాంతికి జరిగిన బాలకృష్ణ జూనియర్ ల మూవీల మధ్య తన ‘పటాస్’ ను విడుదల చేయడానికి భయపడి ఆతరువాత అదే నెలలో రిపబ్లిక్ డేకు విడుదల చేసాడు. ఈసినిమాకు హిట్ టాక్ వచ్చినా సరైన సంక్రాంతి సీజన్ మిస్ అవ్వడంతో అప్పుడు కూడ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఛాన్స్ ను పోగొట్టుకున్నాడు. ఇలా సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఎదో ఒక కారణంతో కళ్యాణ్ రామ్ ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: